పుట్టిన‌రోజు నాడే ప్రేయ‌సి మేహాతో అక్షర్ పటేల్ నిశ్చితార్థం.. ఫోటోలు వైర‌ల్‌

Axar Patel gets engaged to girlfriend Meha on his 28th birthday.టీమ్ఇండియా ఆల్‌రౌండ‌ర్ అక్ష‌ర్ ప‌టేల్ త్వ‌ర‌లో

By తోట‌ వంశీ కుమార్‌  Published on  21 Jan 2022 6:19 AM GMT
పుట్టిన‌రోజు నాడే ప్రేయ‌సి మేహాతో అక్షర్ పటేల్ నిశ్చితార్థం.. ఫోటోలు వైర‌ల్‌

టీమ్ఇండియా ఆల్‌రౌండ‌ర్ అక్ష‌ర్ ప‌టేల్ త్వ‌ర‌లో ఓ ఇంటివాడు కానున్నాడు. త‌న చిన్న‌నాటి స్నేహితురాలు మేహ‌తో గురువారం అక్ష‌ర్ ప‌టేల్ ఎంగేజ్‌మెంట్ ఘ‌నంగా జ‌రిగింది. త‌న పుట్టిన రోజు నాడే అక్ష‌ర్ ప‌టేల్ నిశ్చితార్థం చేసుకోవ‌డం విశేషం. త‌న నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలను అక్ష‌ర్ సోష‌ల్ మీడియాలో అభిమానుల‌తో పంచుకున్నాడు.

అక్షర్ మోకాళ్లపై నిల్చుని ప్రపోజ్ చేస్తున్నట్టుగా ఓ ఫోటో ఉంది. అలాగే ప్రేమ చిహ్నంతో పాటు 'మ్యారీ మీ' అని బ్యాక్‌ గ్రౌండ్‌లో పెద్దపెద్ద అక్షరాలతో రాసి ఉండగా, పూలతో చెక్కిన లవ్ సింబల్‌పై వారిద్దరూ నిల్చున్న ఫొటోలను అక్షర్ పటేల్ షేర్ చేశాడు. ఈ రోజు మా కొత్త జీవితానికి ఆరంభం, ఎప్ప‌టికీ ప్రేమిస్తూనే ఉంటాను అని ఆ ఫోటోల‌ను క్యాప్ష‌న్ ఇచ్చారు. ప్ర‌స్తుతం ఈ ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. నెటీజ‌న్లు శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు. టీమ్ఇండియా లెగ్ స్పిన్న‌ర్ చాహ‌ల్ తో స‌హా ప‌లువురు క్రికెట‌ర్లు విషెస్ తెలిపారు.

ఇదిలాఉంటే.. స్వ‌దేశంలో కివీస్‌తో టెస్ట్ సిరీస్‌ను టీమ్ఇండియా గెల‌వ‌డంలో కీల‌క పాత్ర పోషించిన అక్ష‌ర్‌.. గాయం కార‌ణంగా ద‌క్షిణాఫ్రికా ప‌ర్య‌ట‌కు దూరం అయ్యారు.

Next Story
Share it