తొలి రోజు భారత్‌దే.. స్పిన్నర్లదే ఆధిపత్యం
Axar and Ashwin Share Seven Wickets to Give Hosts The Upper Hand.అహ్మదాబాద్ వేదికగా భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్ ఆసక్తికరంగా సాగుతోంది.
By తోట వంశీ కుమార్ Published on 4 March 2021 6:04 PM ISTఅహ్మదాబాద్ వేదికగా భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్ ఆసక్తికరంగా సాగుతోంది. అచ్చొచ్చిన స్పిన్ అటాక్‌తో ఇంగ్లాండ్‌ను తొలి ఇన్సింగ్స్‌లో 205 పరుగులకే కట్టడి చేసింది భారత్. స్పిన్నర్లు అక్షర్ పటేల్(4/68), రవిచంద్రన్ అశ్విన్(3/47)లకు తోడు పేసర్ మహ్మద్ సిరాజ్ (2/45) రాణించాడు. అనంతరం తొలి రోజు ఆట ముగిసే సమయానికి టీమ్ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టానికి 24 పరుగులు చేసింది. హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ (8), పుజారా (15) పరుగులతో క్రీజులో ఉన్నాడు. ప్రస్తుతం టీమ్ఇండియా 181 పరుగుల లోటుతో ఉంది.
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్.. భారత స్పిన్నర్ల దెబ్బకు ఇబ్బందిపడింది. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 75.5 ఓవర్లలో 205 పరుగులకే ఆలౌటైంది. బెన్‌స్టోక్స్(55: 121 బంతుల్లో 6ఫోర్లు, 2సిక్సర్లు) డాన్ లారెన్స్ (46) మినహా మిగిలిన వారు విఫలమయ్యారు. ఓపెనర్లు జాక్ క్రాలే(9), డొమినిక్ సిబ్లే(2)లను స్పిన్నర్ అక్షర్ పెవిలియన్ పంపడంతో ఇంగ్లీష్ జట్టు 15/2తో కష్టాల్లో పడింది. ఈ దశలో క్రీజులో ఉన్న బెయిర్‌స్టో(28) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేయగా కెప్టెన్ జో రూట్(5) అలా వచ్చి ఇలా వెళ్లిపోయాడు. వీరిద్దరినీ హైదరాబాద్ పేసర్ మహ్మద్ సిరాజ్ ఔట్ చేయడంతో ప్రత్యర్థి టాప్ ఆర్డర్ స్వల్ప స్కోరుకే వెనుదిరిగింది. టీ విరామ సమయానికి 144/5తో నిలిచింది. ఇక ఆఖరి సెషన్‌లో అశ్విన్, అక్షర్ పోటీపడి వికెట్లు పడగొట్టారు. చివరి సెషన్‌లో డేనియల్ లారెన్స్ దూకుడుగా ఆడి జట్టు స్కోరును 200 దాటించాడు.
అనంతరం తొలి ఇన్సింగ్స్‌ను ప్రారంభించిన భారత్‌కు ఆదిలోనే షాక్ తగిలింది. ఇంగ్లాండ్ పేసర్ అండర్సన్ బౌలింగ్‌లో శుభ్‌మన్ గిల్ డకౌట్ అయ్యాడు. దీంతో భారత్ పరుగుల ఖాతా తెరవకుండానే వికెట్ కోల్పోయింది. ఈ దశలో మరో ఓపెనర్ రోహిత్ శర్మకు నయావాల్ పుజారా జతకలిసాడు. వీరిద్దరు మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతూ తొలి రోజును ముగించారు. మూడో టెస్టులో లాగానే పిచ్ స్పిన్ కు సహకరిస్తుంది. బ్యాట్స్‌మెన్ కుదురుకుంటే పరుగులు చేయడం కష్టం కాదు. రెండో రోజు బారత్ ఎన్ని పరుగులు చేస్తుంది అన్న దానిపైనే ఫలితం ఆధారపడి ఉంది.