ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ గ్లెన్ మాక్స్వెల్ (37) IPL 2026 మినీ-వేలంలోకి ప్రవేశించడం లేదని ధృవీకరించాడు. T20 లీగ్‌లో ఇప్పటికే తన చివరి మ్యాచ్ ఆడేశానని స్పష్టం చేశాడు. డిసెంబర్ 16న అబుదాబిలో జరగనున్న మినీ-వేలం నుండి వైదొలిగిన ఆటగాళ్ల లిస్టులో ఆండ్రీ రస్సెల్, ఫాఫ్ డు ప్లెసిస్ తర్వాత మాక్స్ వెల్ చేరాడు.
చాలా చర్చల తర్వాత తాను పెద్ద నిర్ణయం తీసుకున్నానని గ్లెన్ మాక్స్వెల్ సోషల్ మీడియా ద్వారా ధృవీకరించాడు. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో 'పవర్ కోచ్' పాత్రను చేపట్టడానికి రస్సెల్ IPL నుండి వైదొలిగినట్లు తెలిపాడు.
గత సంవత్సరం శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్సీ, రికీ పాంటింగ్ కోచింగ్‌లో పంజాబ్ కింగ్స్ తరపున మాక్స్ వెల్ చివరిసారిగా ఆడాడు. అతని వేలికి గాయం కావడంతో అతను ఆ సీజన్‌కు దూరమయ్యాడు. గత సంవత్సరం జరిగిన మెగా వేలంలో మాక్స్‌వెల్‌ను పంజాబ్ కింగ్స్ రూ. 4.2 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే, మాక్స్‌వెల్ అంచనాలను అందుకోలేకపోయాడు. అతను ఆరు ఇన్నింగ్స్‌లలో కేవలం 48 పరుగులు మాత్రమే చేయగలిగాడు. శ్రేయాస్ మ్యాక్స్ వెల్ ను బౌలర్‌గా ఎక్కువగా ఉపయోగించుకున్నాడు.