ఆస్ట్రేలియాలో రోడ్డు ప్రమాదం.. మాజీ క్రికెటర్ షేన్ వార్న్‌కు గాయాలు
Australia Spinner Shane Warne Injured In bike Accident
By అంజి
ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్, లెజెండరీ స్పిన్నర్ షేన్ వార్న్ బైక్ ప్రమాదంలో గాయపడ్డాడు. సిడ్నీలో కొడుకు జాక్సన్‌తో కలిసి వార్న్ తన బైక్‌పై వెళుతుండగా బైక్ అదుపు తప్పింది. దీంతో అతను కింద పడి 15 మీటర్లకు పైగా ఈడ్చుకెళ్లాబడ్డాడు. యాక్సిడెంట్ తర్వాత వార్న్ మాట్లాడుతూ.. నాకు కొంచెం దెబ్బలు తగిలాయి. చాలా నొప్పిగా ఉన్నానని చెప్పాడు. అదృష్టవశాత్తు పెద్ద ప్రమాదం జరగడంతో షేన్‌వార్న్ అభిమానులు, క్రికెట్ అభిమానులు ఊపిరిపీల్చుకున్నారు. ఈ రోడ్డు ప్రమాదంలో మొదటగా తన కాలు విరిగిపోయిందేమోనని భయపడ్డానని, నడుము కూడా లేవడానికి సహకరించకపోవడంతో చాలా కంగారు పడ్డానని షేన్ వార్న్ చెప్పాడు.
కానీ ఆస్పత్రికి వెళ్లిన తర్వాత.. అతను క్షేమంగా ఉన్నాడని తెలిసింది. వైద్యులు అతడికి చికిత్స అందిస్తున్నారు. 52 ఏళ్ల షేన్ వార్న్ కామెంటేటర్‌గా చేస్తున్నాడు. ఏదేమైనా, ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ డిసెంబర్ 8 నుండి గబ్బాలో ప్రారంభమయ్యే రాబోయే యాషెస్ కోసం కామెంటరీ ఇవ్వనున్నాడు. ఆస్ట్రేలియా తరుపున 145 టెస్టుల్లో షేన్‌వార్న్ 708 వికెట్లు తీశాడు.






