త‌గ్గేదేలే.. ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగిన ఆసీస్‌.. ప్ర‌స్తుతం 22/ 0

Australia chose to bat in second test against India.భార‌త్‌, ఆస్ట్రేలియా జ‌ట్ల మ‌ధ్య అరుణ్ జైట్లీ స్టేడియంలోరెండో టెస్టు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  17 Feb 2023 10:22 AM IST
త‌గ్గేదేలే.. ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగిన ఆసీస్‌.. ప్ర‌స్తుతం 22/ 0

బోర్డ‌ర్ గ‌వాస్క‌ర్ ట్రోఫీలో భాగంగా భార‌త్‌, ఆస్ట్రేలియా జ‌ట్ల మ‌ధ్య ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో రెండో టెస్టు మ్యాచ్ ప్రారంభ‌మైంది. టాస్ గెలిచిన ఆసీస్ కెప్టెన్ ప్యాట్ క‌మిన్స్ మ‌రో ఆలోచన లేకుండా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. పిచ్ స్పిన్న‌ర్ల‌కు స‌హ‌క‌రిస్తుంద‌న్న అంచ‌నాల నేప‌థ్యంలో ఆసీస్ జ‌ట్టు ముగ్గురు స్పిన్న‌ర్లతో బ‌రిలోకి దిగింది. తొలి టెస్టులో ఆడిన రెన్ షా స్థానంలో ట్రావిస్ హెడ్ తుది జ‌ట్టులో స్థానం ద‌క్కించుకున్నాడు.

మ‌రో వైపు టీమ్ఇండియా తుది జ‌ట్టులో ఓ మార్పుతో బ‌రిలోకి దిగింది. గాయం నుంచి కోలుకున్న శ్రేయ‌స్ అయ్య‌ర్ తుది జ‌ట్టులో స్థానం ద‌క్కించుకున్నాడు. సూర్య‌కుమార్ యాద‌వ్ స్థానంలో అత‌డిని తీసుకున్నారు. ఈ మ్యాచ్ పుజారా కెరీర్‌లో వందో మ్యాచ్ కావ‌డం విశేషం. ఈ వందో మ్యాచ్‌లో పుజారా సెంచ‌రీ చేయాల‌ని అత‌డి అభిమానులు కోరుకుంటున్నారు.

నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా నాగ్‌పూర్ వేదిక‌గా జ‌రిగిన తొలి టెస్టులో గెలిచిన భార‌త్ సిరీస్‌లో ప్రస్తుతం 1-0 ఆధిక్యంలో ఉంది. ఈ మ్యాచ్‌లో సైతం టీమ్ఇండియా విజ‌యం సాధిస్తే ప్ర‌పంచ టెస్ట్ ఛాంపియ‌న్ షిప్ ఫైన‌ల్ చేరే అవ‌కాశాలు మ‌రింత మెరుగు కానున్నాయి. అయితే.. తొలి టెస్టులో ఎదురైన ప‌రాభ‌వానికి ఈ మ్యాచ్‌లో విజ‌యం సాధించి సిరీస్‌ను స‌మం చేయ‌డంతో గ‌ట్టి స‌మాధానం చెప్పాల‌ని ఆసీస్ భావిస్తోంది.

ప్ర‌స్తుతం 9 ఓవ‌ర్లు ముగిసే స‌రికి ఆసీస్ వికెట్ న‌ష్ట‌పోకుండా 22 ప‌రుగులు చేసింది. ఉస్మాన్ ఖ‌వాజా 14, డేవిడ్ వార్న‌ర్ 2 ప‌రుగుల‌తో ఆడుతున్నారు.

Next Story