ఆసీస్ కెప్టెన్ ఫించ్ సంచలన నిర్ణయం.. వన్డేలకు వీడ్కోలు
Australia captain Aaron Finch announces retirement from ODI cricket.ఆరోన్ ఫించ్ వన్డేలకు గుడ్ బై చెప్పేశాడు.
By తోట వంశీ కుమార్ Published on 10 Sep 2022 4:17 AM GMTఆస్ట్రేలియా పరిమిత ఓవర్ల కెప్టెన్ ఆరోన్ ఫించ్ క్రికెట్ ప్రేమికులకు షాక్ ఇస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. వన్డేలకు గుడ్ బై చెప్పేశాడు. శనివారం విలేకరుల సమావేశంలో ఫించ్ మాట్లాడుతూ.. అంతర్జాతీయ క్రికెట్‌లో వన్డే లకు రిటైర్‌మెంట్ ప్రకటించాడు. దీంతో ఆదివారం న్యూజిలాండ్‌తో ఆడనున్న మూడో వన్డేనే ఫించ్‌కు ఆఖరి వన్డే మ్యాచ్ కానుంది.
"వన్డేల్లో ఎన్నో అద్భుతమైన జ్ఞాపకాలు ఉన్నాయి. ఆస్ట్రేలియా లాంటి అద్భుతమైన జట్టుకు నాయకత్వం వహించడం అదృష్టంగా బావిస్తున్నా. నా ప్రయాణంలో ఎంతో మంది ఆటగాళ్లు అండగా నిలిచారు. నాకు మద్దుతుగా నిలిచిన క్రికెట్ ఆస్ట్రేలియా, అభిమానులు, ఆటగాళ్లకు కృతజ్ఞతలు" అని ఫించ్ అన్నాడు. ఇక వచ్చే వన్డే ప్రపంచకప్ కోసం కొత్త నాయకుడిని తయారు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నాడు.
A true champion of the white-ball game.
— Cricket Australia (@CricketAus) September 9, 2022
Aaron Finch will retire from one-day cricket after tomorrow's third and final Dettol ODI vs New Zealand, with focus shifting to leading Australia at the #T20WorldCup pic.twitter.com/SG8uQuTVGc
ఫించ్ వన్డేలకు వీడ్కోలు చెప్పడానికి అతడి ఫామ్ కారణంగా తెలుస్తోంది. గత కొంత కాలంగా ఫించ్ తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయడం లేదు. చివరి ఏడు ఇన్నింగ్స్‌లో (5, 5, 1, 15, 0, 0, 0) 26 పరుగులు మాత్రమే చేశాడు. వన్డేల నుంచి తప్పుకున్న ఫించ్ టీ20లకు మాత్రం కెప్టెన్‌గానే ఉండనున్నాడు. ఇప్పటి వరకు 145 వన్డేలు ఆడిన ఫించ్ 5,401 పరుగులు చేశాడు. ఇందులో 17 సెంచరీలు, 30 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.