రెండో వన్డేలోనూ ఓటమి పాలైన టీమిండియా
Australia Beat India In Second Odi. ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలోనూ భారత్ ఓటమి పాలైంది. టాస్ గెలిచి తొలుత
By Medi Samrat
ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలోనూ భారత్ ఓటమి పాలైంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్‌కు ఓపెనర్లు అద్భుత ఆరంభాన్నించ్చారు. డేవిడ్ వార్నర్(77 బంతుల్లో 83), ఆరోన్ ఫించ్(69 బంతుల్లో 60) అర్థ సెంచరీలతో రాణించారు. ఫించ్ అవుట్ కావడంతో క్రీజులోకి వచ్చిన స్టీవ్ స్మిత్(64 బంతుల్లో 104) మరో సెంచరీతో అదరగొట్టాడు. ఆ తరువాత లబుషేన్(61 బంతుల్లో 70) కూడా స్మిత్‌కు చక్కటి సహకారం అందించారు. ఈ క్రమంలోనే అర్థ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇక చివర్లో మ్యాక్స్‌వెల్(29 బంతుల్లో 63) మరోసారి భీకర ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో ఆసీస్ 4 వికెట్లకు 389 పరుగుల భారీ స్కోరు చేసింది.
అనంతరం 390 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 338 పరుగులు మాత్రమే చేయగలిగింది. భారత జట్టుకు ఓపెనర్లు శిఖర్ ధావన్ (23 బంతుల్లో 30), మయాంక్ అగర్వాల్ (26 బంతుల్లో 28) శుభారంభాన్ని అందించలేకపోయారు. ఆ తరువాత వచ్చిన కోహ్లీ(87 బంతుల్లో 89) రాణించాడు. శ్రేయాస్ అయ్యర్(36 బంతుల్లో 38) పర్వాలేదనిపించాడు. ఆ తరువాత క్రీజులోకి వచ్చిన కేఎల్ రాహుల్(66 బంతుల్లో 76) కోహ్లీకి సహకారం అందించాడు. అయితే చివర్లో బ్యాట్స్‌మెన్ పెవిలియన్‌కు క్యూ కట్టడంతో నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 338 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో మరో మ్యాచ్ మిగిలుండగానే ఆసీస్ సిరీస్ కైవసం చేసుకుంది.