తొలి రోజు ఆస్ట్రేలియాదే.. జ‌డ్డూకు నాలుగు వికెట్లు

మూడో టెస్టులో తొలి రోజు ఆట ముగిసే స‌మ‌యానికి ఆస్ట్రేలియా 4 వికెట్ల న‌ష్టానికి 156 ప‌రుగులు చేసింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  1 March 2023 5:05 PM IST
India vs Australia 3rd Test, IND vs AUS

జ‌డ్డూకు నాలుగు వికెట్లు

బోర్డ‌ర్ గవాస్క‌ర్ ట్రోఫీలో భాగంగా ఇండోర్ వేదిక‌గా జ‌రుగుతున్న మూడో టెస్టులో తొలి రోజు ఆట ముగిసే స‌మ‌యానికి ఆస్ట్రేలియా 4 వికెట్ల న‌ష్టానికి 156 ప‌రుగులు చేసింది. కామెరూన్ గ్రీన్ 6, పీట‌ర్ హాండ్స్‌కాంబ్ 7 ప‌రుగుల‌తో క్రీజులో ఉన్నారు. ప్ర‌స్తుతం ఆసీస్ 47 ప‌రుగుల ఆధిక్యంలో ఉంది. ఆస్ట్రేలియా కోల్పోయిన నాలుగు వికెట్ల‌ను ఆల్‌రౌండ‌ర్ ర‌వీంద్ర జ‌డేజానే ప‌డ‌గొట్టాడు. ఆసీస్ బ్యాట‌ర్ల‌లో ఉస్మాన్ ఖ‌వాజా 60, ల‌బుషేన్ 31, స్టీవ్ స్మిత్ 26, ట్రావిస్ హెడ్ 9 ప‌రుగులు చేశారు. భార‌త బౌల‌ర్లు రెండో రోజు ఆసీస్ బ్యాట‌ర్ల‌ను ఎంత త్వ‌ర‌గా ఆలౌట్ చేస్తారు అన్న‌దానిపైనే మ్యాచ్ ఆధార‌ప‌డి ఉంటుంది.

ఇక టీమ్ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో 109 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. భార‌త బ్యాట‌ర్ల‌లో విరాట్ కోహ్లీ 22, శుభ్‌మ‌న్ గిల్ 21, శ్రీక‌ర్ భ‌ర‌త్ 17, రోహిత్ శ‌ర్మ 12, పుజారా 1, ర‌వీంద్ర జ‌డేజా 4 , శ్రేయస్ అయ్య‌ర్ 0, అక్ష‌ర్ ప‌టేల్ 12, అశ్ఇన్ 3, ఉమేష్ యాద‌వ్ 17 ప‌రుగులు చేశారు. ఆస్ట్రేలియా బౌల‌ర్ల‌లో కుహ్నెమ‌న్ 5, ల‌య‌న్ 3, మ‌ర్ఫీ ఓ వికెట్ ప‌డ‌గొట్టాడు.

Next Story