భారత్‌తో టెస్టు సిరీస్‌కు ఆసీస్ జట్టు ఎంపిక
Aussies Team Announcement. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) ముగిసింది. ఇక అంతర్జాతీయ సమరానికి సిద్దం అవుతోంది
By Medi Samrat Published on 13 Nov 2020 8:09 AM ISTఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) ముగిసింది. ఇక అంతర్జాతీయ సమరానికి సిద్దం అవుతోంది టీమ్ఇండియా. సుదీర్ఘ ఆస్ట్రేలియా పర్యటన కోసం భారత జట్టు ఈ రోజు ఆసీస్ బయలు దేరింది. రెండు నెలలకు పైగా సాగనున్న ఈ సుదీర్ఘ పర్యటనలో భారత జట్టు ఆస్ట్రేలియాతో మూడు వన్డేలు, మూడు టీ20లు, నాలుగు టెస్టులు ఆడనుంది.
భారత క్రికెట్ క్రంటోల్ బోర్డు(బీసీసీఐ) ఆస్ట్రేలియాతో తలపడే జంబో జట్టును ఎంపిక చేయగా.. ఆసీస్ మాత్రం వన్డే, టీ20 జట్లను ఎంపిక చేసింది. నేడు సుదీర్ఘ ఫార్మాట్‌లో భారత్‌తో తలపడే ఆసీస్ జట్టును ఎంపిక చేసింది. 17 మందితో కూడిన టెస్టు జట్టులో ఐదుగురు కొత్త ముఖాలకు చోటిచ్చింది. దేశవాళీ టోర్నమెంట్లలో నిలకడగా రాణిస్తోన్న యువ కెరటాలకు చోటు కల్పించింది. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో కొనసాగుతోన్న షెఫర్డ్ షీల్డ్ టోర్నమెంట్‌ను ప్రాతిపదికగా తీసుకుంది.
షెఫ్పర్డ్ షీల్డ్ టోర్నమెంట్‌లో అద్భుత ప్రతిభ కనబరిచిన విల్ పుకోవ్‌స్కీ, కామెరాన్ గ్రీన్‌లకు చోటు కల్పించింది. ఈ టోర్నమెంట్‌లో పుకోవ్‌స్కీ కళ్లు చెదిరే యావరేజ్‌ను నమోదు చేశాడు. వరుసగా రెండు ద్విశకాలు సాధించి 247.5 యావరేజ్‌తో 495 పరుగులు చేశాడు. టోర్నమెంట్ టాప్ స్కోరర్ అతనే. దీంతో వార్నర్ జోడిగా అతడిని ఎంపిక చేసింది. వెస్టర్న్ ఆస్ట్రేలియా తరఫున ఆడుతోన్న కామెరాన్ గ్రీన్ 363 పరుగులు చేశాడు. 72.6 యావరేజ్‌ను సాధించాడు. వారిద్దరితో పాటు లెగ్ స్పిన్నర్ మిఛెల్ స్వెప్‌సన్‌ను టెస్టుల కోసం ఎంపిక చేసినట్టు క్రికెట్ ఆస్ట్రేలియా చీఫ్ సెలెక్టర్ ట్రెవర్ తెలిపారు. షెఫ్పర్డ్ షీల్డ్ టోర్నమెంట్‌లో స్వెప్‌సన్ 23 వికెట్లను పడగొట్టాడు. కోహ్లీసేనతో ఆసీస్ డిసెంబర్ 17 నుంచి టెస్ట్ సిరీస్‌లో తలపడనుంది.
ఆసీస్ టెస్ట్ జట్టు : టీమ్ పైన్(కెప్టెన్), జేమ్స్ పాటిసన్, విల్ పుకోవ్‌స్కీ, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, మిచెల్ స్వీప్‌సన్, మాథ్యూవేడ్, డేవిడ్ వార్నర్, సీన్ అబాట్, జోబర్న్స్, పాట్ కమిన్స్, కామరూన్ గ్రీన్, హాజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, మార్నస్ లబుషేన్, నాథన్ లయన్, మైఖేల్ నాసర్.
భారత టెస్టు జట్టు : విరాట్ కోహ్లీ(కెప్టెన్), మయాంక్ అగర్వాల్, పృథ్వీ షా, కేఎల్ రాహుల్, ఛతేశ్వర్ పుజారా, అజింక్యా రహానే, హనుమ విహారి, శుభమన్‌గిల్, వృద్ధిమాన్ సాహా, రిషబ్ పంత్, బుమ్రా, మహ్మద్ షమి, ఉమేశ్ యాదవ్, నవ్‌దీప్ సైనీ, కుల్‌దీప్ యాదవ్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ సిరాజ్