ఇదేం ప్రేమ‌రా బాబు.. ప్రేయ‌సికి వైర‌టీగా ప్ర‌పోజ్ చేసిన క్రీడాకారిణి

Aussie woman proposes partner by faking injury during softball match.ప్రేమకు లింగభేదం లేదంటూ ఓ మహిళా క్రీడాకారిణి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  13 Dec 2021 3:08 AM GMT
ఇదేం ప్రేమ‌రా బాబు.. ప్రేయ‌సికి వైర‌టీగా ప్ర‌పోజ్ చేసిన క్రీడాకారిణి

ప్రేమకు లింగభేదం లేదంటూ ఓ మహిళా క్రీడాకారిణి మరో మహిళకు వినూత్నంగా ప్రపోజ్‌ చేసింది. ఓ సాఫ్ట్‌బాల్‌ టోర్నీ ఈ వెరైటీ లవ్‌ ప్రపోజల్‌కు వేదికగా మారింది. మ్యాచ్‌ రసవత్తరంగా సాగుతున్న సమయంలో.. గాయ‌ప‌డిన‌ట్లు న‌టించిన క్రీడాకారిణి. త‌న ప్రేయ‌సి గ్రౌండ్‌లోకి రాగానే.. పిచ్ మ‌ధ్య‌లో మెకాళ్ల‌పై నిల‌బ‌డి త‌న‌ను పెళ్లి చేసుకోవాల‌ని కోరింది. ఈ ఘ‌ట‌నతో ఒక్క‌సారిగా అక్క‌డ ఉన్న వారంతా ఆశ్చ‌ర్యానికి లోనైనా.. త‌రువాత అంద‌రూ చ‌ప్ప‌ట్ల‌తో ఎంక‌రైజ్ చేశారు. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

ఆస్ట్రేలియాకు చెందిన సారా రియో, జసింత కమాండేలు ప్రొఫెషనల్ సాఫ్ట్ బాల్ క్రీడాకారిణిలు. వీరిద్ద‌రూ గ‌త రెండేళ్లుగా స‌హ‌జీవ‌నం చేస్తున్నారు. స్టాఫ్ట్‌బాల్ టోర్నీలో భాగంగా పెర్త్‌ వేదికగా ఓ లీగ్ మ్యాచ్ జ‌రిగింది. మ్యాచ్ ర‌స‌వ‌త్తరంగా సాగుతున్న స‌మ‌యంలో.. సారా రియో గాయ‌ప‌డిన‌ట్లుగా న‌టించింది. దీంతో స్టాండ్స్‌లో ఉన్న జ‌సింతా వెంట‌నే మైదానంలోకి ప‌రుగెత్తుకుంటూ వ‌చ్చింది. అప్ప‌టి వ‌ర‌కు గాయ‌ప‌డిన‌ట్లుగా న‌టించిన సారా.. జ‌సింత రాగానే వెంట‌నే మోకాళ్ల నిల‌బ‌డి.. త‌న‌ను పెళ్లి చేసుకోవాల‌ని కోరింది. ఊహించ‌ని ఈ ప‌రిణామంతో జ‌సింతా స‌హా మైదానంలో ఉన్న వారంతా అవాక్క‌య్యారు. తేరుకున్న జ‌సింత‌.. సారాను కౌగిలించుకోవ‌డంతో.. అక్క‌డ ఉన్న అంద‌రూ చ‌ప్ప‌ట్లు కొట్టారు. కాగా.. ఈ మ్యాచ్‌కు సారా తన మిత్రులు, కుటుంబ సభ్యులనందరీని ఆహ్వానించింది. వారందరి సమక్షంలోనే ఇష్ట సఖి ముందు వివాహా ప్రతిపాదనను ఉంచింది. ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఇదేం ప్రేమ రా బాబు అంటూ కొంద‌రు నెటీజ‌న్లు కామెంట్లు పెడుతున్నారు.

Next Story