ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టీ20లో భారత్ విజయం సాధించింది. 187 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా.. 18.3 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. చివరిలో వాషింగ్టన్ సుందర్, జితేశ్ శర్మ మెరుపులతో భారత్‌కు విజయాన్ని అందించారు. సుందర్ (49*) వీరోచిత ఇన్సింగ్స్ ఆడాడు. ఓపెనర్లు అభిషేక్ (25), సూర్య (24), తిలక్ వర్మ (29), జితేష్ (22* ) రాణించారు.
ఆసీస్ బౌలర్లలో నాథన్ 3 వికెట్లు, స్టాయినిస్, క్సేవియర్ చెరో వికెట్ తీశారు. అంతకుముందు టిమ్ డేవిడ్, స్టాయినిస్ రాణించడంతో ఆస్ట్రేలియా 186 రన్స్ చేసింది. భారత్ బౌలర్లలో అర్షదీప్ 3 వికెట్లు పడగొట్టగా.. వరుణ్ చక్రవర్తి 2, శివమ్ దూబే ఒక వికెట్ తీశారు. ఈ మ్యాచ్‌లో టీమిండియా విజయంతో సిరీస్‌లో ఇరు జట్లు 1 - 1తో సమంగా ఉన్నాయి.