అఫ్గాన్‌పైనే భారీ ఆశలు : అశ్విన్
Ashwin says India not pondering on World Cup semis permutations.టీ20 ప్రపంచకప్‌లో నేడు భారత జట్టు స్కాట్లాండ్‌తో
By తోట వంశీ కుమార్ Published on 5 Nov 2021 7:07 AM GMTటీ20 ప్రపంచకప్‌లో నేడు భారత జట్టు స్కాట్లాండ్‌తో తలపడనుంది. తొలి రెండు మ్యాచ్‌ల్లో ఘోర పరాజయం తరువాత పుంజుకున్న టీమ్ఇండియా అఫ్గానిస్థాన్ జట్టుపై భారీ విజయాన్ని సాధించింది. అదే ఊపులో నేడు స్కాట్లాండ్‌పై కూడా ఘన విజయాన్ని సొంతం చేసుకోవాలని బావిస్తోంది. అయితే.. ఇప్పుడు అందరి దృష్టి భారత జట్టు సెమీస్ చేరుతుందా..? లేదా అన్న దానిపైనే ఉంది. ఈ విషయంపై టీమ్ఇండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ స్పందించాడు.
తమ ధ్యాసంతా మిగిలిన మ్యాచ్‌లలో ఎలా విజయం సాధించాలి అన్న దానిపైనే ఉందన్నాడు. సెమీస్ చేరే విషయంపై జట్టులో ఎలాంటి చర్చ జరగడం లేదని.. చివరి రెండు మ్యాచ్‌ల్లో జట్టులోని ప్రతి ఒక్కరూ అవకాశం స్వదినియోగం చేసుకోవాలని బావిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. అయితే.. ఎవరు ఎప్పుడు ఎలా ఆడతారనే విషయం తమ చేతుల్లో లేదన్నాడు. నాలుగేళ్ల తర్వాత టీ20 ప్రపంచకప్ జట్టులోకి రావడం పట్ల అశ్విన్ ఆనందం వ్యక్తం చేశాడు. ఈ టోర్నిలో రాణించాలని.. జట్టుకు గెలిపించే పాత్ర పోషించాలని కలలు కన్నట్లు చెప్పాడు. అఫ్గాన్‌పై గెలుపుతో జట్టులో నూతనోత్తేజం వచ్చిందన్నాడు. ఇక భారత జట్టు సెమీస్ చేరాలంటే.. అఫ్గానిస్థాన్ జట్టు ఖచ్చితంగా న్యూజిలాండ్‌ను ఓడించాలి. దీంతో ఈ మ్యాచ్‌పై తాము భారీ ఆశలనే పెట్టుకున్నట్లు అశ్విన్ చెప్పుకొచ్చాడు.
భారత్ సెమీస్ చేరాలంటే..?
భారత జట్టు సెమీస్ చేరాలంటే అంత సులభం కాదు. టీమ్ఇండియా సెమీస్ చేరాలంటే.. న్యూజిలాండ్ జట్టు ఆడనున్న రెండు మ్యాచుల్లో ఒకటి అయినా ఓడిపోవాల్సి ఉంటుంది. అలాగే భారత జట్టు తన చివరి రెండు మ్యాచుల్లో భారీ విజయాలను నమోదు చేయాలి. తద్వారా నెట్‌రన్‌రేట్ అఫ్గాన్ కన్నా ఎక్కువ ఉండేలా చూసుకోవాలి. ప్రస్తుతం అఫ్గాన్ రన్‌రేటు 1.481 గా ఉంది. భారత రన్‌రేటు 0.073గా ఉంది. ఈ నేపథ్యంలో అభిమానుల ఆశలు అన్ని ప్రధానంగా అఫ్గానిస్థాన్, న్యూజిలాండ్ మ్యాచ్‌పైనే ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్ గెలవాలని అఫ్గాన్ ప్రజలతో పాటు 130 కోట్ల మంది భారతీయులు కోరుకుంటున్నారు.