సిరాజ్ గాయంపై అశ్విన్ ఏమన్నాడంటే..?
Ashwin Provides Injury Update Of Mohammed Siraj.జోహెనెస్‌బర్గ్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో
By తోట వంశీ కుమార్ Published on 4 Jan 2022 1:53 PM ISTజోహెనెస్‌బర్గ్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టు తొలి రోజు ఆట చివర్లో టీమ్ఇండియా పేసర్ మహ్మద్ సిరాజ్ గాయంతో మైదానాన్ని వీడాడు. దీంతో రెండో రోజు ఆటలో అతడు బౌలింగ్ చేస్తాడా..? లేదా అన్న సందేహాలు తలెత్తాయి. ఈ క్రమంలో సిరాజ్ గాయంపై అశ్విన్ స్పష్టత నిచ్చే ప్రయత్నం చేశాడు. సిరాజ్ పట్టుదల కలిగిన వ్యక్తి అని.. అతడు తప్పక మైదానంలో తిరిగి అడుగుపెడతాడనే ఆశాభావం వ్యక్తం చేశాడు.
మీడియా సమావేశానికి వచ్చే ముందే మెడికల్ టీమ్‌తో మాట్లాడినట్లు అశ్విన్ చెప్పాడు. ప్రస్తుతం సిరాజ్ గాయాన్ని వైద్య బృందం పరిశీలిస్తుందని.. గాయం తీవ్రతను బట్టి అతడు ఆడేది లేనిది నిర్ణయం తీసుకుంటారన్నారు. అయితే.. సిరాజ్ పట్టుదల గల వ్యక్తి.. అతడు ఖచ్చితంగా మైదానంలోకి దిగి జట్టు కోసం అత్యుత్తమ ఆటతీరును కనబరుస్తాడని చెప్పుకొచ్చాడు.
ఇక మ్యాచ్‌లో అశ్విన్ 50 బంతుల్లో 6 పోర్లు బాది 46 పరుగులు చేశాడు. దీంతో జట్టు స్కోర్ 200 పరుగులు దాటింది. తన బ్యాటింగ్‌పై అశ్విన్ మాట్లాడుతూ.. తాను ఇంత మంచి స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేయడాని ప్రత్యేకంగా ఏ ప్రయత్నం చేయలేదని.. తాను లయ అందుకోవడానికి బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాఠోడ్ సాయం చేశాడని తెలిపాడు.
'నేను గత కొన్నేళ్లుగా బ్యాటింగ్ టెక్నిక్‌పై దృష్టి సారించాను. జట్టుకు భారీ పరుగులు అందించి నా వంతు తోడ్పాటు అందించాలనుకున్నాను. అంతకుముందు కూడా నేను బాగా ఆడిన సందర్భాలు ఉండడంతో ఈ మ్యాచ్‌లో మంచి స్ట్రైక్‌రేట్‌తో అలాంటి మెరుగైన షాట్లు ఆడేందుకు ప్రత్యేకంగా శ్రమపడలేదు. నా బ్యాటింగ్‌లోని లోపాలను సరిచేస్తూ.. విలువైన సూచనలు ఇస్తూ మళ్లీ నేను బ్యాటింగ్‌లో లయ అందుకునేలా బ్యాటింగ్ కోచ్ విక్రమ్ సాయపడినట్లు' అశ్విన్ చెప్పాడు.