దీప్తి జివాంజికి అర్జున అవార్డు.. రాష్ట్రపతి భవన్‌లో ఘనంగా ఖేల్ రత్న పురస్కారాలు

భారత అత్యున్నత క్రీడా పురస్కారం మేజర్‌ ఖేల్‌ రత్నను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రదానం చేశారు. శుక్రవారం రాష్ట్రపతి భవన్‌లో అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది.

By Knakam Karthik
Published on : 17 Jan 2025 2:05 PM IST

NATIONAL NEWS, SPORTS, KHEL RATNA AWARDS, DEEPTHI JIVANJI, MANU BHAKAR, GUKESH

దీప్తి జివాంజికి అర్జున అవార్డు.. రాష్ట్రపతి భవన్‌లో ఘనంగా ఖేల్ రత్న పురస్కారాలు

భారత అత్యున్నత క్రీడా పురస్కారం మేజర్‌ ఖేల్‌ రత్నను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రదానం చేశారు. శుక్రవారం రాష్ట్రపతి భవన్‌లో అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది. షూటింగ్‌లో డబుల్‌ ఒలింపిక్‌ పతకాలను గెలుచుకున్న మనుబాకర్‌, ప్రపంచ చెస్‌ చాంపియన్‌ గుకేష్‌, హాకీ కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ సింగ్‌, పారా అథ్లెట్‌ ప్రవీణ్‌కుమార్‌లు రాష్ట్రపతి నుండి ప్రతిష్టాత్మకమైన ఖేల్‌ రత్న అవార్డులను అందుకున్నారు.



తెలుగు రాష్ట్రాలకు చెందిన క్రీడాకారిణులు జివాంజి దీప్తి (పారా అథ్లెటిక్స్‌), జ్యోతి యర్రాజీ (అథ్లెటిక్స్‌) అర్జున పురస్కారాలను స్వీకరించారు. 2014 నుంచి అథ్లెటిక్స్‌లో ప్రాతినిధ్యం వహిస్తున్న జ్యోతి.. 2019లో తొలిసారి జాతీయ అండర్‌-18 మహిళల హర్డిల్స్‌లో స్వర్ణ పతకం కైవసం చేసుకొని అందరి దృష్టిని ఆకర్షించింది. 2022 ఆసియా క్రీడల్లో 100 మీటర్ల హార్డిల్స్‌లో రజత పతకం సాధించి పారిస్‌ ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. 2024 పారిస్‌ ఒలింపిక్స్‌ 100మీ. హార్డిల్స్‌లో భారత్‌నుంచి ప్రాతినిధ్యం వహించిన ఏకైక మహిళా అథ్లెట్‌గా జ్యోతి యర్రాజి చరిత్ర సృష్టించారు. పారిస్‌ పారా ఒలింపిక్స్‌లో మహిళల 400మీ. 20 విభాగంలో దీప్తి కాంస్యం సాధించింది. 55.82 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకుని ఈ ఫీట్‌ సాధించింది.



వీరితో పాటు 32 మంది అథ్లెట్లను అర్జున అవార్డుతో సత్కరించారు. వీరిలో 17 మంది పారా అథ్లెట్లు ఉన్నారు. ఐదుగురు ద్రోణాచార్య పురస్కారాలును అందుకున్నారు. పారిస్‌ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన రెజ్లర్‌ అమన్‌ సెహ్రావత్‌, షూటర్లు స్వప్నిల్‌ కుసాలే, సరబ్జోత్‌ సింగ్‌, పురుషుల హాకీ క్రీడాకారులు జర్మన్‌ ప్రీత్‌ సింగ్‌, సుఖ్‌జీత్‌ సింగ్‌, సంజరు అభిషేక్‌ సహా పలువురు క్రీడాకారులు అర్జున అవార్డులను అందుకున్నారు.


Next Story