4వ టెస్టుకు ముందు ఆ ఆలయాన్ని సంద‌ర్శించిన కోహ్లీ దంప‌తులు

Anushka Sharma, Virat Kohli Visit Mahakaleshwar Temple In Ujjain. విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో ఉన్న మహాకాళేశ్వర ఆలయాన్ని సందర్శించారు

By Medi Samrat  Published on  4 March 2023 5:26 PM IST
4వ టెస్టుకు ముందు ఆ ఆలయాన్ని సంద‌ర్శించిన కోహ్లీ దంప‌తులు

Anushka Sharma, Virat Kohli


ఆస్ట్రేలియాతో భారత్ 4వ టెస్టు మ్యాచ్‌కు ముందు విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో ఉన్న మహాకాళేశ్వర ఆలయాన్ని సందర్శించారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో ఈ సెలబ్రిటీ జంట ఇతర భక్తులతో పాటు ఆలయం లోపల కూర్చున్నారు. ఇండోర్‌లో భారత్, ఆస్ట్రేలియా మధ్య 3వ టెస్ట్ ముగిసిన ఒక రోజు తర్వాత శనివారం ఉదయం ఆలయానికి హాజరయ్యారు. "మేము పూజలు చేయడానికి ఇక్కడకు వచ్చాము. మహాకాళేశ్వర ఆలయంలో దర్శనం బాగా జరిగింది" అని అనుష్క శర్మ ANI కి తెలిపింది. కోహ్లీ చొక్కా లేకుండా మెడలో కండువ, రుద్రాక్షలు వేసుకొని నుదుటిన పెద్ద బొట్టు పెట్టుకుని కనిపించారు. అనుష్క చీర ధరించింది. అర్చకులు ప్రత్యేక పూజలు చేసి కోహ్లీ, అనుష్క దంపతులకు ఆశీర్వచనాలు ఇచ్చారు. దంపతులు గుడిలో కూర్చొని పూజలు చేస్తున్న వీడియో వైరల్ అవుతోంది.

ఇండోర్ లో జరిగిన మూడో టెస్టులో భారత్ 9 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. నాలుగో టెస్టు ఈనెల 9వ తేదీన అహ్మదాబాద్ లో మొదలవుతుంది. జూన్‌లో లండన్‌లోని ఓవల్‌లో జరగనున్న ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు ఆస్ట్రేలియా అర్హత సాధించింది. ఆస్ట్రేలియాతో జరిగే ఫైనల్‌లో చోటు దక్కించుకోవాలంటే భారత్‌ కు చివరి టెస్టులో విజయం అవసరం. నాలుగో టెస్టు మార్చి 9 నుంచి అహ్మదాబాద్‌లో జరగనుంది.




Next Story