మరోసారి తండ్రయిన కోహ్లీ.. మగబిడ్డకు జన్మనచ్చిన అనుష్క శర్మ

టీమిండియా మాజీ కెప్టెన్‌, బ్యాటింగ్ స్టార్ విరాట్ కోహ్లీ మరోసారి తండ్రయ్యాడు. కోహ్లీ భార్య, హీరోయిన్ అనుష్క శర్మ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది.

By అంజి
Published on : 21 Feb 2024 6:40 AM IST

Anushka Sharma, Virat Kohli, baby boy, Akaay, Bollywood

Anushka Sharma, Virat Kohli, baby boy, Akaay, Bollywood

టీమిండియా మాజీ కెప్టెన్‌, బ్యాటింగ్ స్టార్ విరాట్ కోహ్లీ మరోసారి తండ్రయ్యాడు. కోహ్లీ భార్య, హీరోయిన్ అనుష్క శర్మ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ మేరకు ఫిబ్రవరి 20, మంగళవారం నాడు కోహ్లీ, అనుష్క కలిసి ఓ ప్రకటనలో తెలిపారు. తమకు ఫిబ్రవరి 15న మగబిడ్డ జన్మించినట్టు వెల్లడించారు. తమ రెండు సోషల్ మీడియా ప్రొఫైల్‌లలో విడుదల చేసిన ప్రకటనలో.. కోహ్లి , అనుష్క ఫిబ్రవరి 15 న అబ్బాయి జన్మించినట్లు తెలిపారు.

'మా చిట్టితల్లి వామికకు తమ్ముడు పుట్టాడు' అంటూ సంతోషం వ్యక్తం చేశారు. తమ బిడ్డకు అకాయ్ అని నామకరణం చేసినట్టు కోహ్లీ, అనుష్క తమ ప్రకటనలో వివరించారు. ఈ శుభసమయంలో మీ ఆశీస్సులు కోరుకుంటున్నామని, అదే సమయంలో తమ వ్యక్తిగత జీవితాన్ని గౌరవించాలని కోరుకుంటున్నామని తెలిపారు. కోహ్లి మరియు అనుష్క శర్మ 2017లో పెళ్లి చేసుకున్నారు. ఈ స్టార్ కపుల్ 11 జనవరి 2024న వారి కుమార్తె వామిక మూడవ పుట్టినరోజును జరుపుకున్నారు.

అకాయ్ అనే పేరు యొక్క అర్థం ఏమిటి?

అకాయ్ అనే పేరు టర్కిష్ మూలం కలిగిన హిందీ పేరు. గూగుల్ సెర్చ్ ఇంజిన్ ప్రకారం, ఈ పేరు "పూర్ణ చంద్రుని కాంతిని ప్రకాశవంతం చేయడం" అని అర్థం. సంస్కృత భాష ప్రకారం, అకాయ్ అనే పేరు "అమరత్వం" లేదా "క్షీణించనిది" అని అర్ధం.

Next Story