న్యూజిలాండ్‌తో జరిగిన లీగ్ మ్యాచ్‌లో విరాట్ కోహ్లి ఔట్ అవ్వడంతో అనుష్క శర్మ ఒక్కసారిగా షాక్ అయింది. పాయింట్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న గ్లెన్ ఫిలిప్స్ ఒక అద్భుతమైన క్యాచ్ కారణంగా కోహ్లీ అవుట్ అయ్యాడు. తన 300వ వన్డేలో కోహ్లీ కేవలం 11 పరుగులకే ఔట్ అయ్యాడు. 'ఓ మై గాడ్!' అంటూ స్పందించిన అనుష్క.. కోహ్లీ అవుట్ అయ్యాక ఒక్కసారిగా షాక్ అయింది.
అనుష్క శర్మ ముందు చాలా మంచి షాట్ ఆడినప్పటికీ విరాట్ కోహ్లి అవుట్ కావడం దురదృష్టకరం. BCCI కుటుంబ సభ్యుల విషయంలో పరిమితులు విధించడంతో ఆటగాళ్ల కుటుంబ సభ్యులు అత్యంత అరుదుగా మ్యాచ్ లకు హాజరవుతున్నారు. అనుష్క తన భర్త సుదీర్ఘ ఇన్నింగ్స్ ఆడాలని కోరుకుంది. కానీ కోహ్లీ లక్కు ఏ మాత్రం కలిసిరాలేదు. అంతకు ముందు పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లి అద్భుతమైన సెంచరీని సాధించాడు.