ఢిల్లీ క్యాపిటల్స్‌కు మరో ఎదురుదెబ్బ!

ఐపీఎల్ సీజన్ 2024 ఆరంభానికి ముందే ఢిల్లీ క్యాపిటల్స్‌కు మరో షాక్‌ ఎదురైంది.

By Srikanth Gundamalla  Published on  15 March 2024 6:52 AM GMT
delhi capitals, ipl-2024, cricket ,

  ఢిల్లీ క్యాపిటల్స్‌కు మరో ఎదురుదెబ్బ!

ఐపీఎల్ సీజన్ 2024 ఆరంభానికి ముందే ఢిల్లీ క్యాపిటల్స్‌కు మరో షాక్‌ ఎదురైంది. ఆ జట్టుతో ఒప్పందం కుదుర్చుకున్న సౌతాఫ్రికా పేసర్‌ లుంగి ఎంగిడి తాజా సీజన్‌ నుంచి తప్పుకున్నాడు. గాయం కారణంగా పదిహేడో ఎడిషన్ మొత్తానికి ఎంగిడి దూరం కానున్నాడు. స్టార్ పేసర్ దూరం కావడంతో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఎదురుదెబ్బ తగిలింది. అయితే.. ఎంగిడి స్థానాన్ని ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ జేక్‌ ఫ్రేజర్‌ మెగర్క్‌తో స్థానాన్ని ఢిల్లీ క్యాపిటల్స్‌ భర్తీ చేయనుంది. ఈ నియామకానికి సంబంధించి ఫ్రాంచైజీ ప్రకటన విడుదల చేసింది.

మెల్‌బోర్న్‌కు చెందిన హార్డ్‌ హిట్టింగ్ బ్యార్ మెగర్క్‌ లెగ్‌ స్పిన్నర్ కూడా. వెస్టిండీస్‌తో గత నెలలో జరిగిన వన్డే సిరీస్‌ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. ఇప్పటి వరకు ఆడిన రెండు మ్యాచుల్లో కలిపి 51 పరుగులు చేశాడు. ఇక ఎంగిడి డిమ నొప్పి కారణంగా ఢిల్లీ క్యాపిటల్స్‌కు దూరం అయ్యాడు. రూ.50 లక్షల రిజర్వ్‌ ప్రైజ్‌తో యాజమాన్యం జేక్‌ ఫ్రేజర్‌ మెగర్క్‌ జట్టులో చేర్చుకుంది. ఇదిలా ఉంటే ఇంగ్లండ్‌ బ్యాటర్ హ్యారీ బ్రూక్‌ కూడా వ్యక్తిగత కారణాలతో ఐపీఎల్ సీజన్ 2024 మొత్తానికి దూరం అయ్యాడు. ఇటీవల అతను ప్రకటించిన విషయం తెలిసిందే.

హ్యారీ బ్రూక్‌కు ఢిల్లీ క్యాపిటల్స్‌ రూ.4 కోట్లు ఖర్చు చేసి కొనుగోలు చేసింది. కానీ.. అతను చివరికి హ్యాండ్ ఇవ్వడంతో ఢిల్లీ క్యాపిటల్స్‌కు షాక్‌ తగిలింది. తాజాగా ఎంగిడి కూడా దూరం అయ్యాడు. ఐపీఎల్ 2024 సీజన్ ఈ నెల 22వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఢిల్లీ క్యాపిట్లస్‌ తొలి మ్యాచ్‌ మార్చి 23వ తేదీన మొహాలీ వేదికగా పంజాబ్‌ కింగ్స్‌తో ఉండనుంది.

Next Story