డిసెంబరు 27, శుక్రవారం నాడు మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో భారత బ్యాటర్ విరాట్ కోహ్లీ అభిమానులతో ఘర్షణకు దిగినంత పని చేశాడు. బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్‌లో 2వ రోజు విరాట్ కోహ్లీ స్కాట్ బోలాండ్ అవుట్ అయిన తర్వాత పెవిలియన్‌కు తిరిగి వస్తున్నప్పుడు ఈ సంఘటన జరిగింది.
కోహ్లిని MCG అభిమానులలో ఒక వర్గం ఎగతాళి చేసింది. ఇది కోహ్లీకి కోపం తెప్పించింది. MCG టన్నెల్‌లోకి ప్రవేశించిన తర్వాత కోహ్లీ వెనక్కు వచ్చి మరీ తనను ఎగతాళి చేస్తున్న వ్యక్తులను కోపంగా చూస్తూ ఉండిపోయాడు. ఇంతలో MCG సెక్యూరిటీ సభ్యుడు అక్కడికి చేరుకుని, విరాట్ కోహ్లీని శాంతింపజేసాడు.
టెస్ట్ మ్యాచ్ చివరి సెషన్‌లో విరాట్ కోహ్లీ యశస్వి జైస్వాల్‌తో కలిసి బాగా బ్యాటింగ్ చేశాడు. అయినప్పటికీ, ఆఖర్లో ఊహించని రీతిలో భారత్ వికెట్లను కోల్పోయింది. 100 పరుగుల భాగస్వామ్యాన్ని పూర్తి చేసిన తర్వాత, యశస్వి జైస్వాల్ అనుకోని విధంగా రనౌట్ అయ్యాడు. 7 బంతుల తర్వాత, విరాట్ కోహ్లీ కూడా స్కాట్ బోలాండ్‌ను కీపర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరుకున్నాడు.