వన్డే ప్రపంచకప్ భారత జట్టు గెలవడంలో ఆటగాళ్లు ఎంత కీలక పాత్ర పోషించారో, తమ కోచ్ అమోల్ మజుందార్ సర్ వెనకుండి నడిపించారని కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్ తెలిపారు. ఆయన వచ్చాక డ్రెస్సింగ్ రూమ్‌లో చాలా మార్పులు వచ్చాయని, అంతకుముందు తరచూ కోచ్‌లు మారుతూ ఉండేవారు. కానీ, ఆయన రాకతో మార్పు మొదలైందని స్పష్టం చేసింది. ఆయన మహిళల జట్టును నిర్మించారని, రాత్రింబవళ్లు ప్రాక్టీస్ చేయించారన్నారు.
ఈ రెండున్నర ఏళ్లలో ఆయన ఇచ్చిన కోచింగ్‌తోనే ఛాంపియన్‌గా అవతరించగలిగామని, మజుందార్ ఆధ్వర్యంలో పనిచేసే అవకాశం రావడం నిజంగా అదృష్టమని హర్మన్ కౌర్ తెలిపారు. టోర్నమెంట్ విజేతగా నిలిచిన భారత్‌కు రూ.39.55 కోట్లు ప్రైజ్ మనీగా దక్కుతుంది. రన్నరప్ సౌతాఫ్రికా జట్టు రూ.19.77 కోట్ల అందుకుంటుంది. ఈ వరల్డ్ కప్‌లో ప్రైజ్ మనీ+బోనస్‌లు + పార్టిసిపేషన్ ఫీ+బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సకారియా ప్రకటించిన రూ.51 కోట్లతో కలిపి మొత్తం భారత మహిళల జట్టుకు రూ.93.66 కోట్ల వరకు దక్కే అవకాశం ఉంది.