మరోసారి ఊహించని నిర్ణయం తీసుకున్న అంబటి రాయుడు
ఈ సంవత్సరం ప్రారంభంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ నుండి రిటైర్మెంట్ ప్రకటించిన అంబటి రాయుడు
By Medi Samrat Published on 31 Aug 2023 1:04 PM GMTఈ సంవత్సరం ప్రారంభంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ కు రిటైర్మెంట్ ప్రకటించిన అంబటి రాయుడు.. వ్యక్తిగత కారణాల వల్ల కరేబియన్ ప్రీమియర్ లీగ్ ను కూడా వీడాడు. సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్ కు ఆడుతున్న రాయుడు వ్యక్తిగత కారణాల వల్ల వైదొలిగినట్లు ESPNcricinfo నివేదించింది.ప్రస్తుతం జరుగుతున్న ఎడిషన్‌లో పేట్రియాట్స్ తరఫున రాయుడు మూడు ఇన్నింగ్స్‌ల్లో 117.50 స్ట్రైక్ రేట్‌తో 47 పరుగులు చేశాడు. మూడు ఇన్నింగ్స్‌లలో అతని స్కోర్లు 0, 32, 15 మాత్రమే.
రెండు వారాల క్రితం రాయుడు పేట్రియాట్స్‌కు మార్క్యూ ప్లేయర్‌గా ప్రకటించారు. ప్రవీణ్ తాంబే తర్వాత మెన్స్ CPLలో ఆడిన రెండవ భారతీయుడు రాయుడు. రాయుడుతో పాటు జింబాబ్వే పేసర్ బ్లెస్సింగ్ ముజారబానీ కూడా వ్యక్తిగత కారణాలతో టోర్నీ నుంచి నిష్క్రమించాడు. 26 ఏళ్ల ముజారబానీ పేట్రియాట్స్ కోసం మూడు మ్యాచ్ లు ఆడాడు. 10.61 యావరేజ్ తో ఒక వికెట్ తీసుకున్నాడు.
కరేబియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్స్‌కు దూరం కావాలని రాయుడు నిర్ణయించుకున్నాడు. దీనికి గల కారణాలను తెలియరావట్లేదు. వ్యక్తిగత కారణాలతోనే అంబటి రాయుడు ఈ టోర్నీకి దూరమైనట్లు మేనేజ్‌మెంట్ తెలిపింది. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిథ్యాన్ని వహించాడు అంబటి రాయుడు. ఈ రెండు జట్ల తరఫున 204 మ్యాచ్‌లను ఆడాడు. 14 సీజన్లల్లో 4,329 పరుగులు చేశారు. ఇందులో ఓ సెంచరీ, 22 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 11 ప్లేఆఫ్స్ మ్యాచ్‌లను ఆడిన ఘనత అంబటి రాయుడికి ఉంది. అలాగే ఎనిమిదిసార్లు ఐపీఎల్ ఫైనల్స్ ఆడాడు. అయిదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన జట్లల్లో సభ్యుడు.