ఆఫ్ఘనిస్తాన్ జట్టుకి తొలి మ్యాచులోనే ఎదరు దెబ్బ తగిలింది. బంగ్లాదేశ్ చేతిలో ఓడిపోయింది. టాస్ ఓడి బ్యాటింగ్ కి దిగిన ఆఫ్ఘనిస్తాన్ జట్టు తొలి 15 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టానికి 83 పరుగులతో పటిష్టంగా కనిపించింది. ఆ తర్వాత 73 పరుగులకే చివరి 9 వికెట్లను కోల్పోయి 156 పరుగులతో సరిపెట్టుకుంది. బంగ్లా స్పిన్నర్లు షకీబ్, మెహదీ హసన్ మిరాజ్ అద్భుతంగా బౌలింగ్ వేశారు. బంగ్లా బౌలర్లలో షకీబ్, మెహదీ హాసన్ మిరాజ్ చెరో మూడు వికెట్లు తీశారు. షోరీఫుల్ ఇస్లాం కి రెండు వికెట్లు దక్కాయి. ఆఫ్ఘన్ బ్యాటర్లలో గుర్బాజ్ 47 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. 37.2 ఓవర్లకే బంగ్లాదేశ్ జట్టు ఆలౌట్ అయింది.
ఇక లక్ష్య ఛేదనలో బంగ్లాదేశ్ ఆరంభంలో రెండు వికెట్లు కోల్పోయినా.. నజీముల్ శాంటో(59), మెహదీ హాసన్(57) మిరాజ్ బంగ్లాదేశ్ వైపుకి తిప్పారు. దీంతో 157 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని 34.4 ఓవర్లలో నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. మెహదీ హసన్ మిరాజ్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.