భారత ఓపెనర్ల కంటే వాళ్లిద్దరే ఎక్కువ పరుగులు చేస్తారు
Akash Chopra feels Pujara and Rahane will score more runs than the openers.గురువారం కాన్పూర్ వేదికగా
By తోట వంశీ కుమార్ Published on 24 Nov 2021 7:39 AM GMTగురువారం కాన్పూర్ వేదికగా టీమ్ఇండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఇక ఈ మ్యాచ్‌లో భారత ఓపెనర్ల కంటే సీనియర్ బ్యాట్స్‌మెన్లు రహానే, పుజారా జంట ఎక్కువ పరుగులు చేస్తుందని మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత ఆకాశ్ చోప్రా జోస్యం చెప్పాడు. మొదటి టెస్టులో టీమ్ఇండియా ఓపెనర్ల కంటే పుజారా, రహానే జోడి ఎక్కువ పరుగులు చేస్తుందనుకుంటున్నా. ఎందుకంటే చాలా రోజులుగా నయావాల్ పుజారా శతకం సాధించలేదు. మరో పక్క జట్టులో తన స్థానం ప్రశ్నార్థకమైన పరిస్థితుల్లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకునేందుకు రహానే తప్పని సరిగా రాణించాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఇద్దరూ స్పిన్ బాగా ఆడతారు. ఈ నేపథ్యంలో స్వదేశంలో జరుగుతున్న టెస్టులో వీరిద్దరూ రాణించే అవకాశం ఉందని ఆకాశ్ చోప్రా చొప్పుకొచ్చాడు.
రెగ్యులర్ ఓపెనర్లు రోహిత్ శర్మకు విశ్రాంతి నివ్వగా.. రాహుల్ గాయంతో దూరం అయిన సంగతి తెలిసిందే. దీంతో కొత్త ఓపెనింగ్ జోడి బరిలోకి దిగనుంది. వారు ఏ మేరకు రాణిస్తారో చూడాల్సి ఉండదన్నాడు. ఇక భారత స్పిన్నర్లు ఖచ్చితంగా పదికి పైగా వికెట్లు తీస్తారనిపిస్తోందన్నాడు. ఇక కివీస్ జట్టులో కెప్టెన్ కేన్ విలియమ్ సన్, లాథమ్ మంచి ఫామ్‌లో ఉన్నారని.. వారిద్దరూ కలిసి 125 పరుగులకు పైగా చేసే అవకాశం ఉందని చెప్పాడు. ఇక తొలి టెస్టులో భారత్ విజయం సాధిస్తుందని చోప్రా ధీమా వ్యక్తం చేశాడు. కాగా.. ఈ మ్యాచ్‌కు రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీకి విశ్రాంతి నిచ్చిన నేపథ్యంలో అజింక్య రహానే ఈ మ్యాచ్‌కు నాయకత్వం వహించనున్నాడు. రెండో టెస్టుకు కోహ్లీకి అందుబాటులోకి రానున్నాడు.