రెండేళ్లుగా ఒక్క టీ20 మ్యాచ్ కూడా ఆడ‌ని ఆటగాడిని ప్ర‌పంచ క‌ప్‌కు ఎంపిక చేసిన ఆస్ట్రేలియా..!

టీ20 ప్రపంచకప్ 2024 కోసం ఆస్ట్రేలియా బుధవారం 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. మిచెల్ మార్ష్ జట్టుకు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు

By Medi Samrat  Published on  1 May 2024 5:09 AM GMT
రెండేళ్లుగా ఒక్క టీ20 మ్యాచ్ కూడా ఆడ‌ని ఆటగాడిని ప్ర‌పంచ క‌ప్‌కు ఎంపిక చేసిన ఆస్ట్రేలియా..!

టీ20 ప్రపంచకప్ 2024 కోసం ఆస్ట్రేలియా బుధవారం 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. మిచెల్ మార్ష్ జట్టుకు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. అనుభవజ్ఞుడైన బ్యాట్స్‌మెన్ స్టీవ్ స్మిత్, యువ సంచలనం జాక్ ఫ్రేజర్ మెక్‌గర్క్, అనుభవజ్ఞుడైన ఫాస్ట్ బౌలర్ జాసన్ బెహ్రెన్‌డార్ఫ్, ఆల్ రౌండర్ మథ్యూ షార్ట్‌లు జట్టులో చోటు కోల్పోయారు.

అస్ట‌న్ అగర్ టీ20 ప్రపంచ కప్ కోసం ఆస్ట్రేలియా జట్టులోకి తిరిగి వచ్చాడు. లెఫ్టార్మ్ స్పిన్నర్ అస్ట‌న్ అగర్ 2022 టీ20 ప్రపంచకప్ తర్వాత ఒక్క టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్ కూడా ఆడలేదు. ఇదిలావుంటే.. ఐపీఎల్‌లో ప్రదర్శన నిలకడగా లేనప్పటికీ ఆల్‌రౌండర్లు మార్కస్ స్టోయినిస్, కెమెరూన్ గ్రీన్ కు జట్టులో చోటు దక్కించుకున్నారు.

సెలెక్ష‌న్ క‌మిటీ ఛైర్మన్ జార్జ్ బెయిలీ మాట్లాడుతూ.. ఆస్ట్రేలియా జట్టులో సమతుల్యత‌ ఉందని.. 9వ టీ20 ప్రపంచకప్‌లో మెరుగైన ప్రదర్శన కనబరుస్తానని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఆస్ట‌న్ అగర్ జ‌ట్టులోకి రావడంపై మేము సంతోషిస్తున్నాము. టోర్నీలో అతడు ప్రధాన పాత్ర పోషిస్తాడని నమ్ముతున్నాం. మార్కస్‌ స్టోయినిస్‌, గ్లెన్‌ మాక్స్‌వెల్‌, కెమెరూన్‌ గ్రీన్‌, మిచెల్‌ మార్ష్‌లు జ‌ట్టుకు బలం చేకూరుస్తారు. బ్యాటింగ్‌లో చాలా ఆప్ష‌న్‌లు ఉన్నప్ప‌టికీ.. మేము వేదిక, ప్రత్యర్థిని బట్టి ఆటగాళ్లను ఎంపిక చేసిన‌ట్లు తెలిపాడు.

టీ20 ప్రపంచకప్ 2024లో ఆస్ట్రేలియన్ జట్టు గ్రూప్-బిలో ఉంది. వారు జూన్ 5న బార్బడోస్‌లో ఒమన్‌తో మ్యాచ్ ద్వారా టోర్నీని ప్రారంభిస్తారు. గ్రూప్‌-బిలో ఆస్ట్రేలియా, ఒమన్‌తో పాటు ఇంగ్లండ్‌, నమీబియా, స్కాట్‌లాండ్‌లు కూడా ఉన్నాయి.

Next Story