క్రికెట‌ర్ రషీద్ ఖాన్ ఇంట తీవ్ర విషాదం

Afghanistan spinner Rashid khan's cousin passes away.అఫ్గానిస్తాన్ స్టార్ క్రికెట‌ర్‌, స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ మాజీ ఆట‌గాడు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  2 Jan 2022 11:29 AM IST
క్రికెట‌ర్ రషీద్ ఖాన్ ఇంట తీవ్ర విషాదం

అఫ్గానిస్తాన్ స్టార్ క్రికెట‌ర్‌, స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ మాజీ ఆట‌గాడు ర‌షీద్ ఖాన్ ఇంట తీవ్ర విషాదం నెల‌కొంది. ర‌షీద్ క‌జిన్ హ‌మీద్‌ఖాన్ గ‌త‌రాత్రి క‌న్నుమూశారు. ఈ విష‌యాన్ని స్వ‌యంగా ర‌షీద్‌ఖాన్ సోష‌ల్ మీడియా వేదిక‌గా వెల్ల‌డించారు. భావోద్వేగ పోస్టును ట్విట‌ర్ వేదిక‌గా అభిమానుల‌తో పంచుకున్నారు.

'నా కజిన్‌ హమీద్‌ఖాన్‌ ఇక లేరు. అతడి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను' అని రషీద్‌ ట్వీట్‌ చేశాడు. అనారోగ్య కార‌ణాల‌తో హ‌మీద్ ఖాన్ మృతి చెందిన‌ట్లు తెలుస్తోంది. ఈ విష‌యం తెలుసుకున్న ఫ్యాన్స్‌.. సోష‌ల్ మీడియా వేదిక‌గా సంతాపాన్ని తెలియ‌జేస్తున్నారు.

ఇదిలా ఉంటే ప్ర‌స్తుతం ర‌షీద్‌ఖాన్ ఆస్ట్రేలియాలో ఉన్నాడు. బిగ్‌బాష్ లీగ్‌లో ఆడుతున్నాడు. ఆడిలైడ్‌ స్టైకర్స్‌కు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న ర‌షీద్‌.. జ‌ట్టు విజ‌యాల్లో కీల‌క పాత్ర పోషిస్తున్నాడు. 2021 వ‌ర‌కు ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(ఐపీఎల్‌)లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌కు ర‌షీద్‌ఖాన్ ప్రాతినిధ్యం వ‌హించాడు. కాగా.. ర‌షీద్ ఖాన్‌కు స‌న్‌రైజ‌ర్స్ జ‌ట్టు రీటైన్ చేసుకోలేదు. దీంతో అత‌డు ఐపీఎల్ 2022 కోసం నిర్వ‌హించే మెగా వేలానికి అందుబాటులోకి వ‌చ్చాడు. ఫిబ్ర‌వ‌రిలో ఈ మెగావేలాన్ని నిర్వహించేందుకు భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) స‌న్నాహాకాలు చేస్తోంది. ఇక బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లో స‌త్తా చాట‌గ‌ల ర‌షీద్ ఖాన్‌ను వేలంలో ద‌క్కించుకునేందుకు దాదాపు అన్ని ఫ్రాంచైజీలు సిద్దంగా ఉన్నాయి. ప్ర‌స్తుతం ర‌షీద్ ఉన్న ఫామ్‌ను చూస్తుంటే.. మెగా వేలంలో అత‌డికి భారీ ధ‌ర ల‌భించ‌డం ఖాయం.

Next Story