Video : అనవసర దూకుడు నాకు నచ్చలేదు.. అందుకే వారికి బ్యాట్‌తోనే సమాధానం చెప్పా..

ఆసియా కప్ సూపర్-4లో భాగంగా భారత్-పాక్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో టీమిండియా అద్భుత ప్రదర్శన చేసి 172 పరుగుల లక్ష్యాన్ని ఆరు వికెట్లు మిగిలి ఉండగానే సాధించింది.

By -  Medi Samrat
Published on : 22 Sept 2025 9:54 AM IST

Video : అనవసర దూకుడు నాకు నచ్చలేదు.. అందుకే వారికి బ్యాట్‌తోనే సమాధానం చెప్పా..

ఆసియా కప్ సూపర్-4లో భాగంగా భారత్-పాక్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో టీమిండియా అద్భుత ప్రదర్శన చేసి 172 పరుగుల లక్ష్యాన్ని ఆరు వికెట్లు మిగిలి ఉండగానే సాధించింది. ఈ విజయంలో యువ ఓపెనర్ అభిషేక్ శర్మ కీల‌క పాత్ర పోషించాడు. అభిషేక్ 39 బంతుల్లో 74 పరుగులతో తుఫాను ఇన్నింగ్స్ ఆడాడు. అయితే.. పాక్ ఆటగాళ్ల అనవసర దూకుడు తనకు నచ్చలేదని, బ్యాట్ తోనే సమాధానం చెప్పాలని నిర్ణయించుకున్నట్లు మ్యాచ్ అనంతరం అభిషేక్ వెల్లడించాడు.

ఆసియా కప్‌లో ఇరు జట్ల మధ్య జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ హ్యాండ్‌షేక్ చేయకపోవడం పాకిస్థాన్‌ను ఇబ్బంది పెట్టగా.. రెండో మ్యాచ్‌లో అభిషేక్ పొరుగు దేశాన్ని కష్టాల్లో పడేసాడు. మ్యాచ్ అనంతరం అభిషేక్ మాట్లాడుతూ.. 'నేను చాలా సింపుల్‌గా ఆలోచిస్తాను. కారణం లేకుండా వారు (పాకిస్థానీ ఆటగాళ్లు) మాపైకి ఎక్కడం నాకు నచ్చలేదు. నేను ప్రతిస్పందించగలిగే ఏకైక మార్గం.. బ్యాట్‌తో వారికి గుణపాఠం చెప్పడం అని పేర్కొన్నాడు.

ఆ త‌ర్వాత అభిషేక్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు.. దానికి క్యాప్షన్‌లో 'మీరు మాట్లాడుతూ ఉండండి, మేము గెలుస్తూనే ఉంటాము' అని రాశాడు.

ఇదిలావుంటే.. అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్ భారత్‌కు శుభారంభం అందించారు. వీరిద్దరూ కలిసి 105 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి పాక్ బౌలర్లపై ఒత్తిడి పెంచారు. అభిషేక్ మాట్లాడుతూ, 'స్కూల్ టైం నుంచి కలిసి ఆడుతున్నాం, ఒకరి ఆట మరొకరు అర్థం చేసుకున్నాం. మేం మ్యాచ్‌ని పూర్తి చేయాలని భావించి, అదే చేశాం. గిల్ ప్రతిస్పందించే విధానాన్ని నేను నిజంగా ఆనందించాను అని పేర్కొన్నాడు.

పవర్‌ప్లేలో భారత్ మ్యాచ్‌ను తమ నుంచి లాక్కుందని పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ అగా కూడా అంగీకరించాడు. అతను మాట్లాడుతూ.. 'మేము ఇంకా ఖచ్చితమైన మ్యాచ్ ఆడటానికి కొంచెం దూరంలో ఉన్నాము. పవర్‌ప్లేలో వారు ఆటను పూర్తిగా మార్చేశారు. మేము ఇంకా 10-15 పరుగులు చేసి ఉంటే ఫలితం మరోలా ఉండేదన్నాడు.

Next Story