ఇదే చర్చ.. అభిషేక్‌ను తప్పించి ఫినిషర్‌ను జట్టులోకి తీసుకొస్తారా..?
2026 T20 ప్రపంచ కప్‌లో భారత్ ఇంగ్లాండ్‌తో రెండవ సెమీఫైనల్‌లో తలపడనుంది.
By - Medi Samrat |
2026 T20 ప్రపంచ కప్‌లో భారత్ ఇంగ్లాండ్‌తో రెండవ సెమీఫైనల్‌లో తలపడనుంది. ఈ మ్యాచ్ మార్చి 5న ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరుగుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం సాయంత్రం 7:00 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ కీలక మ్యాచ్ కు ముందు అభిషేక్ శర్మ ఎంపికపై చర్చ తీవ్రమైంది. భారత్ తమ ప్లేయింగ్ ఎలెవన్ లో ఏవైనా మార్పులు చేస్తుందా అని అభిమానులు ప్రశ్నిస్తున్నారు.
ఈ ప్రపంచ కప్ కు ముందు తన బ్యాట్ తో విధ్వంసం సృష్టించిన అభిషేక్, టోర్నమెంట్ లో దారుణంగా విఫలమవుతున్నాడు. గ్రూప్ దశలో వరుసగా మూడు మ్యాచ్‌ల్లో డకౌట్‌గా వెనుదిరగడం.. వెస్టిండీస్‌తో జరిగిన వర్చువల్ క్వార్టర్ ఫైనల్‌లో 11 బంతుల్లో 10 పరుగులు మాత్రమే చేయడంతో అతన్ని జట్టు నుంచి తొలగించాలనే డిమాండ్లు తీవ్రమయ్యాయి. మొత్తం మీద అభిషేక్ ఆరు మ్యాచ్‌ల్లో 13.33 సగటుతో 80 పరుగులు చేయగా.. అతని అత్యుత్తమ స్కోరు 55. జింబాబ్వేపై ఈ అర్ధ సెంచరీ చేశాడు.
అభిషేక్ సెమీ-ఫైనల్ నుంచి తప్పుకుంటే, సంజు సామ్సన్, ఇషాన్ కిషన్ ఇన్నింగ్స్‌ను ప్రారంభిస్తారు. రింకు సింగ్ ఫినిషర్‌గా తిరిగి రావచ్చు.. అయితే ఇది అసంభవం. వెస్టిండీస్‌ను ఓడించి సెమీ-ఫైనల్స్‌కు చేరిన భారత జట్టు ప్లేయింగ్ లెవెన్‌లో ఎలాంటి మార్పులు చేయకుండానే బరిలోకి దిగే అవకాశం ఉంది. విజేత జట్టునే బరిలోకి దించేందుకు యాజమాన్యం ఏమాత్రం వెనుకాడదు.
భారత్ ప్రాబబుల్ ప్లేయింగ్ 11:
సంజు శాంసన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా.
ఇంగ్లాండ్ ప్రాబబుల్ ప్లేయింగ్ 11:
ఫిలిప్ సాల్ట్, జోస్ బట్లర్ (వికెట్ కీపర్), హ్యారీ బ్రూక్ (కెప్టెన్), జాకబ్ బెథెల్, టామ్ బాంటన్, సామ్ కుర్రాన్, విల్ జాక్స్, లియామ్ డాసన్, రెహాన్ అహ్మద్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్.
భారత జట్టు:
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అక్షర్ పటేల్, సంజు శాంసన్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, ఇషాన్ కిషన్, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, రింకు సింగ్, మహ్మద్ సిరాజ్.