ఆస్ట్రేలియాకు నితీష్ రెడ్డి.. బోర్డర్-గవాస్కర్ టెస్ట్ సిరీస్ జట్టు ఇదే!!

ఆస్ట్రేలియాలో జరగబోయే బోర్డర్-గవాస్కర్ టెస్ట్ సిరీస్ కోసం బీసీసీఐ భారతజట్టును ప్రకటించింది.

By Kalasani Durgapraveen  Published on  26 Oct 2024 2:39 PM IST
ఆస్ట్రేలియాకు నితీష్ రెడ్డి.. బోర్డర్-గవాస్కర్ టెస్ట్ సిరీస్ జట్టు ఇదే!!

ఆస్ట్రేలియాలో జరగబోయే బోర్డర్-గవాస్కర్ టెస్ట్ సిరీస్ కోసం బీసీసీఐ భారతజట్టును ప్రకటించింది.18 మంది సభ్యుల జట్టులో అభిమన్యు ఈశ్వరన్, హర్షిత్ రాణా, నితీష్ రెడ్డిని ఎంపిక చేసింది. ఐదు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ లో మొదటిది నవంబర్ 22న పెర్త్‌లో ప్రారంభమవుతుంది.

భారత జట్టు: రోహిత్ శర్మ (సి), జస్ప్రీత్ బుమ్రా (విసి), యశస్వి జైస్వాల్, అభిమన్యు ఈశ్వరన్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్, రిషబ్ పంత్ (డబ్ల్యుకె), సర్ఫరాజ్ ఖాన్, ధృవ్ జురెల్ (డబ్ల్యుకె), ఆర్ అశ్విన్, ఆర్ జడేజా , మొహమ్మద్ సిరాజ్, ఆకాష్ దీప్, ప్రసిద్ధ్ కృష్ణ, హర్షిత్ రాణా, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్

రిజర్వ్‌లుగా ముఖేష్ కుమార్, నవదీప్ సైనీ, ఖలీల్ అహ్మద్ ను ప్రకటించారు. మహ్మద్ షమీని భారతజట్టు లోకి తీసుకోలేదు. పేస్ విభాగంలో జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్‌ల జోడీకి మద్దతుగా ఆకాష్ దీప్ తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. ప్రసిద్ధ్ కృష్ణ ను కూడా జట్టులోకి తీసుకున్నారు. ఆంధ్రా మీడియం-పేస్ ఆల్-రౌండర్ నితీష్ రెడ్డి ఆస్ట్రేలియాకు వెళుతుండడం విశేషం. ముకేశ్ కుమార్, నవదీప్ సైనీ, ఖలీల్ అహ్మద్‌ల పేస్ త్రయాన్ని భారత్ రిజర్వ్‌గా తీసుకుంటోంది. వాషింగ్టన్ సుందర్‌ను జట్టులో కొనసాగిస్తూ ఉండగా, అక్షర్ పటేల్ ను ఎంపిక చేయలేదు.


Next Story