విరాట్ రిటైర్మెంట్‌పై ఏబీ డివిలియర్స్ ఆసక్తికర కామెంట్స్
విరాట్‌ను ఉద్దేశించి ఏబీ డివిలియర్స్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు.
By Srikanth Gundamalla Published on 26 Sept 2023 1:25 PM ISTవిరాట్ రిటైర్మెంట్‌పై ఏబీ డివిలియర్స్ ఆసక్తికర కామెంట్స్
కొంతకాలం పాటు ఫామ్‌ను కోల్పోయిన విరాట్ కోహ్లీ మళ్లీ చెలరేగిపోతున్నాడు. బ్యాట్‌ను ఝులిపిస్తున్నాడు. వరుసగా పరుగులు సాధిస్తూ టీమిండియాకు అండగా నిలుస్తున్నాడు. అయితే.. ప్రస్తుతం వన్డే వరల్డ్ కప్-2023 కోసం సిద్ధం అవుతున్నాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడు వన్డేల సరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లకు దూరంగా ఉన్నాడు. రాజ్‌కోట్ వేదికగా జరిగే మూడో వన్డే మ్యాచ్‌కు మాత్రం అందుబాటులోకి వచ్చాడు. ఆసియాకప్-2023లో పాకిస్తాన్‌పై అద్భుత శతకంతో చెలరేగిన కోహ్లీ.. వరల్డ్ కప్‌లోనూ అదే దూకుడు కొనసాగించాలని భావిస్తున్నాడు.
కాగా.. విరాట్ కోహ్లీకి దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ మంచి ఫ్రెండ్ అందరికీ తెలిసిన విషయమే. అయితే.. విరాట్‌ను ఉద్దేశించి డివిలియర్స్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ఈ ఏడాది వరల్డ్ కప్ భారత్ సొంతం చేసుకుంటే విరాట్ కోహ్లీ వైట్‌బాల్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించే చాన్స్ ఉందని ఏబీడీ వ్యాఖ్యానించాడు. వన్డేలు, టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించడానికి కోహ్లీకి ఇదే సరైన సమయం అని డివిలియర్స్ అన్నాడు. అయితే.. కోహ్లీ సౌతాఫ్రియా వేదికగా 2027లో జరిగే వరల్డ్ కప్ కోసం రావడానికి ఇష్టపడతాడని తనకి తెలుసు అని.. కానీ అది చాలా కష్టమని అన్నాడు. ఎందుకంటే 2027 వరల్డ్ కప్‌కు ఇంకా చాలా సమయం ఉందని అన్నాడు. బహుశా విరాట్ కూడా ఇదే చెప్పొచ్చని ఏబీడీ అన్నాడు. ఇక భారత్ వరల్డ్ కప్ గెలిసత్.. కోహ్లీ పరిమిత ఓవర్ల క్రికెట్‌కు గుడ్‌బై చెప్పే చాన్స్ ఉందని డివిలియర్స్ అన్నాడు.
అయితే.. విరాట్ కోహ్లీ ప్రస్తుతం పూర్తి ఫిట్‌గా ఉన్నాడని డివిలియర్స్ చెప్పాడు. అతడు ఎప్పటికప్పుడు విశ్రాంతి తీసుకుంటున్ఆనడని.. కాబట్టి మరికొన్నాళ్ల పాటు ఆడొచ్చనే విషయాన్ని కూడా ప్రస్తావించాడు ఏబీడి. కాగా.. కోహ్లీ గత కొంతకాలంగా భారత్ తరఫున వన్డేలు, టెస్టులు మాత్రమే ఆడుతున్నాడు. కోహ్లీ ఇప్పటి వరకు ఇండియా తరఫున 111 టెస్టులు, 280 వన్డేలు, 115 టీ20లతో పాటు.. ఐపీఎల్‌లో 237 మ్యాచ్‌లు ఆడాడు. ఇక 37 ఏళ్ల వయసులో క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన ఏబీ డివిలియర్స్ సౌతాఫ్రికా తరఫున 114 టెస్టులు, 228 వన్డేలు, 78 టీ20 మ్యాచ్‌లు ఆడాడు.