శ్రీలంక టూర్‌కు బయలుదేరిన టీమిండియా
A New look Team india leave for SriLanka.శ్రీలంకతో సిరీస్ ఆడేందుకు శిఖర్ ధావన్ నేతృత్వంలోని టీమ్ఇండియా
By తోట వంశీ కుమార్
శ్రీలంకతో సిరీస్ ఆడేందుకు శిఖర్ ధావన్ నేతృత్వంలోని టీమ్ఇండియా సోమవారం లంకకు బయలుదేరింది. బీసీసీఐ ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానంలో లంక పర్యటకు ఎంపికైన భారత ఆటగాళ్లంతా బయలుదేరారు. ఈ టూర్‌లో భాగంగా భారత్.. శ్రీలంతో మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచుల్లో తలపడనుంది. ఈ నేపథ్యంలో గత రెండు వారాలుగా ముంబైలోని ఓ స్టార్ హోటల్లో క్వారంటైన్‌లో ఉన్నారు భారత ఆటగాళ్లు. ఆ గడువు నేటితో ముగిసింది.
ఆటగాళ్లు విమానంలో వెలుతున్న ఫోటోలను బీసీసీఐ ట్విటర్‌లో పోస్టు చేసింది. ఈ టీమ్‌కు రాహుల్ ద్రవిడ్ కోచ్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. కెప్టెన్ ధావన్‌తో కలిసి అతడు ఆదివారం మీడియాతో మాట్లాడాడు. టీ20 వరల్డ్‌కప్ ఈ ఏడాది చివర్లో ఉన్న నేపథ్యంలో ఈ టూర్‌లో సత్తా చాటాలని సంజు శాంసన్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్‌లాంటి యువకులు భావిస్తున్నారు. వరల్డ్ కప్ టీమ్ వీరి లక్ష్యమైనా ముందు సిరీస్ గెలవడంపైనే దృష్టి సారించాలని కోచ్ ద్రవిడ్ చెప్పాడు.
All SET! 💙
— BCCI (@BCCI) June 28, 2021
Sri Lanka bound 🇱🇰✈️#TeamIndia 🇮🇳 #SLvIND pic.twitter.com/eOMmiuxi28
లంక టూర్‌కు భారత జట్టు ఇదే..
శిఖర్ ధావన్, పృథ్వీ షా, దేవ్‌దత్ పడిక్కల్, రుతురాజ్ గైక్వాడ్, సూర్యకుమార్ యాదవ్, మనీష్ పాండే, హార్దిక్ పాండ్యా, నితీష్ రాణా, ఇషాన్ కిషన్, సంజు శాంసన్, యజువేంద్ర చాహల్, రాహుల్ చహర్, కే గౌతమ్, కృనాల్ పాండ్యా, కుల్‌దీప్ యాదవ్, వరున్ చక్రవర్తి, భువనేశ్వర్‌కుమార్, దీపక్ చహర్, నవ్‌దీప్ సైనీ, చేతన్ సకారియా