రోహిత్‌ను చూసిన ఆనందంలో ఏడ్చేసిన అభిమాని.. హిట్‌మ్యాన్ ఏం చేశాడంటే..?

A little fan started crying on seeing Rohit Sharma. త‌న అభిమాన ఆట‌గాడైన రోహిత్‌ని చూసి ఓ చిన్నారి క‌న్నీళ్లు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  10 Jan 2023 5:51 AM GMT
రోహిత్‌ను చూసిన ఆనందంలో ఏడ్చేసిన అభిమాని.. హిట్‌మ్యాన్ ఏం చేశాడంటే..?

విధ్వంస‌కర వీరుల్లో టీమ్ఇండియా కెప్టెన్, హిట్‌మ్యాన్ రోహిత్ శ‌ర్మ ఒక‌డు. ఎలాంటి బౌలింగ్‌నైనా చిన్నాభిన్నం చేస్తాడు. అత‌డి వ‌ల్ల ఎంతో మంది బౌల‌ర్లు నిద్ర‌లేని రాత్రిళ్లు గడిపారు. ఇదిలా ఉంటే.. హిట్ మ్యాన్‌కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. దేశ, విదేశాల్లో లెక్క‌లేనంత మంది అభిమానులు అత‌డి సొంతం. ఇక రోహిత్ ప్రాక్టీస్ చేసేట‌ప్పుడు కూడా అభిమానులు అత‌డిని చూసేందుకు వ‌స్తుంటారు. వారిని నిరాశ‌ప‌ర‌చ‌కుండా షేక్ హ్యాండ్ ఇవ్వడంతో పాటు సెల్ఫీలు దిగుతుంటాడు రోహిత్‌.

కాగా.. బంగ్లాదేశ్‌తో జ‌రిగిన రెండో వ‌న్డేలో రోహిత్ బొట‌న‌వేలుకి గాయమైన సంగ‌తి తెలిసిందే. దీంతో మూడో వ‌న్డేతో పాటు టెస్టు సిరీస్‌కు దూరం అయ్యాడు. ఇక శ్రీలంక‌తో టీ20 సిరీస్ కూడా ఆడ‌లేదు. గాయం నుంచి కోలుకోవ‌డంతో నేటి నుంచి లంక‌తో ప్రారంభం కానున్న వ‌న్డే సిరీస్‌లో రోహిత్ ఆడ‌నున్నాడు. ఈ నేప‌థ్యంలో సోమ‌వారం గౌహ‌తిలో రోహిత్ ప్రాక్టీస్ చేస్తున్న స‌మ‌యంలో ఓ ఘ‌ట‌న జ‌రిగింది. త‌న అభిమాన ఆట‌గాడైన రోహిత్‌ని చూసి ఓ చిన్నారి క‌న్నీళ్లు పెట్టుకున్నాడు.

ప్రాక్టీస్ అనంత‌రం అభిమానుల‌ను ప‌ల‌క‌రించేందుకు రోహిత్ వెళ్లాడు. అక్క‌డ ఉన్న గుంపులో ఓ బాలుడు రోహిత్‌ను చూసి క‌న్నీరు పెట్టుకోగా.. దీన్ని గ‌మ‌నించిన హిట్‌మ్యాన్ ఆ బాలుడి వ‌ద్ద‌కు వెళ్లి అత‌డిని ఓదార్చాడు. అనంత‌రం అత‌డితో సెల్పీ దిగ‌డంతో పాటు మ‌రికొంద‌రు అభిమానుల‌కు ఆటోగ్రాఫ్‌లు ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైరల్ గా మారింది. దట్ ఈజ్ రోహిత్ అంటూ హిట్‌మ్యాన్ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.

Next Story
Share it