భయంకరమైన విషయాన్ని చెప్పిన చాహల్.. 'తాగిన ఓ ప్లేయర్.. 15వ అంతస్తు బాల్కనీ నుంచి '
A drunk MI player hung me from 15th floor balcony says Yuzvendra Chahal.టీమ్ఇండియా ఆటగాడు యజ్వేంద్ర
By తోట వంశీ కుమార్ Published on 8 April 2022 8:00 AM GMTటీమ్ఇండియా ఆటగాడు యజ్వేంద్ర చాహల్ ఓ చేదు అనుభవాన్ని గుర్తు చేసుకున్నాడు. వెన్నులో వణుకుపుట్టించే ఆ భయంకరమైన ఘటనను పంచుకున్నాడు. 2013లో ఘటన జరుగగా.. 9 సంవత్సరాల తరువాత ఇంత వరకు ఎవరికి తెలియని ఆ ఘటనను చెప్పాడు. ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో చాహల్ రాజస్థాన్ రాయల్స్ తరుపున ఆడుతున్న సంగతి తెలిసిందే. మూడు మ్యాచుల్లో 7 వికెట్లు తీసి జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు.
ఈ క్రమంలో రాజస్థాన్ రాయల్స్ తన సోషల్ మీడియా ఖాతాలో ఓ వీడియోను పోస్టు చేసింది. ఆ వీడియోలో అశ్విన్.. చాహల్, కరణ్ నాయర్ లను ఇంటర్య్వూ చేశాడు. ఈ క్రమంలో చాహల్ మాట్లాడుతూ.. 2013లో తాను ముంబై ఇండియన్స్ తరుపున ఆడినప్పుడు జరిగిన ఘటనను గుర్తు చేసుకున్నాడు. ఇంత వరకు ఈ విషయం చాలా మందికి తెలియదని చెప్పాడు. 2013 ఐపీఎల్ సీజన్‌లో బెంగళూరులో ఓ మ్యాచ్‌లో విజయం సాధించిన తరువాత జట్టు సభ్యులంతా కలిసి పార్టీ చేసుకున్నాం. ఆ సమయంలో ఒక క్రికెటర్ బాగా తాగి ఉన్నాడు. తన వద్దకు అతడు రమ్మని చెప్పడంతో అతడి వద్దకు వెళ్లాను.
అతడు వెంటనే నన్ను ఎత్తుకుని బాల్కానీలో 15 వ అంతస్తు నుంచి తనను వేలాడదీశాడని, చంపినంత పని చేశాడని చాహల్ చెప్పుకొచ్చాడు. వెంటనే అతడి మెడను గట్టిగా పట్టుకున్నా. ఏ మాత్రం కొంచెం అటు ఇటు అయినా నా పని అయిపోయేది. వెంటనే అక్కడ ఉన్న వారు సకాలంలో స్పందించడంతో బతికిపోయా. అలా నేను తృటిలో చావు నుంచి తప్పించుకున్నా. ఆ ఘటన తరువాత ఎక్కడికైనా వెళితే ఎలా ఉంటాడో తెలిసి వచ్చిందని చాహల్ అన్నాడు. అయితే.. సదరు క్రికెటర్ ఎవరు అనేది విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. ఇప్పటికైనా అతడి పేరును బయట పెట్టాలని అభిమానులు సోషల్ మీడియా వేదికగా కోరుతున్నారు. బీసీసీఐ వెంటనే స్పందించి సదరు ఆటగాడిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
కాగా.. 2013లో ముంబై జట్టు రూ.10లక్షల బేస్‌ప్రైస్‌తో చాహల్‌ను కొనుగోలు చేసింది. ఆ మరుసటి ఏడాది అతడిని విడిచిపెట్టగా బెంగళూరు రాయల్ చాలెంజర్స్ జట్టులోకి వెళ్లిపోయాడు. అక్కడ కీలక స్పిన్నర్‌గా ఎదిగాడు. ఈ సీజన్‌కు ముందు బెంగళూరు వదిలి వేయడంతో మెగా వేలంలో రాజస్థాన్ అతడిని దక్కించుకుంది.
Royals' comeback stories ke saath, aapke agle 7 minutes hum #SambhaalLenge 💗#RoyalsFamily | #HallaBol | @goeltmt pic.twitter.com/RjsLuMcZhV
— Rajasthan Royals (@rajasthanroyals) April 7, 2022