క్రికెట్ చరిత్రలోనే అత్యంత విషాదకరమైన రోజు.. నేటికి 9 ఏళ్లు..!
క్రికెట్ చరిత్రలో అత్యంత విషాదకరమైన రోజులలో ఈరోజు ఒకటి. 9 ఏళ్ల క్రితం ఇదే రోజున ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్‌మెన్ ఫిలిప్ హ్యూస్ బౌన్సర్ తగిలి మరణించాడు.
By Medi Samrat Published on 27 Nov 2023 5:08 AM GMTక్రికెట్ చరిత్రలో అత్యంత విషాదకరమైన రోజులలో ఈరోజు ఒకటి. 9 ఏళ్ల క్రితం ఇదే రోజున ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్‌మెన్ ఫిలిప్ హ్యూస్ బౌన్సర్ తగిలి మరణించాడు. బౌన్సర్ తాకిన వెంటనే హ్యూస్ మైదానంలో కుప్పకూలి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. దీంతో అందరూ ఆశ్చర్యపోయారు. వెంటనే ఫిలిప్ హ్యూస్‌ను ఆసుపత్రికి తరలించినప్పటికీ.. అతడి ప్రాణాలను కాపాడలేకపోయారు. క్రికెట్ లోకాన్ని శోక సంద్రంలో మిగిల్చి హ్యూస్ వెళ్లిపోయాడు. నేటికీ ఆ సంఘటన ఎవరూ మరిచిపోలేదు. భద్రతా కోణం నుండి ఫిలిప్ హ్యూస్ మరణం తర్వాత ఐసీసీ ఎలాంటి మార్పులు చేసిందో తెలుసకుందాం.
ఆస్ట్రేలియాలో దేశవాళీ క్రికెట్ పోటీలు జరుగుతాయి. ఆ మ్యాచ్ సౌత్ ఆస్ట్రేలియా, న్యూ సౌత్ వేల్స్ ఆఫ్ షెఫీల్డ్ షీల్డ్ మధ్య జరిగింది. ఈ సమయంలో ఫిలిప్ హ్యూస్ 63 పరుగులతో అజేయంగా ఆడుతున్నాడు. ఫిలిప్స్ హెల్మెట్ ధరించి ఉన్నాడు.. కానీ బంతి అతని మెడ దగ్గర తాకింది. అంతకుముందు హెల్మెట్‌లకు సేఫ్టీ గార్డు లేదు. ఇప్పుడు సేఫ్టీ గార్డు ఉంటుంది. బంతి మెడకు తగలగానే ఫిలిప్ మైదానంలో పడిపోయాడు. ఆ తర్వాత అతడిని ఆసుపత్రికి తరలించగా.. అక్కడ శస్త్రచికిత్స చేసి ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో ఉంచిన ఫలితం లేకపోయింది. ఆ మ్యాచ్ కూడా వెంటనే రద్దు చేయబడింది.
ఫిలిప్ హ్యూస్ 27 నవంబర్ 2014న స్పృహ కోల్పోయాడు. అతని పుట్టినరోజుకు మూడు రోజుల ముందు హ్యూస్ మరణించాడు. ఈ ఘటన తర్వాత యూఏఈలో పాకిస్థాన్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న టెస్టు రెండో రోజు కూడా రద్దయింది. 2014 డిసెంబర్ 4న భారత్, ఆస్ట్రేలియా మధ్య జరగాల్సిన టెస్ట్ మ్యాచ్ కూడా ఆలస్యం అయింది. ఈ మ్యాచ్ 9వ తేదీకి వాయిదా పడింది. ఇక్కడ అతిపెద్ద ప్రశ్న ఏమిటంటే.. ఫిలిప్ హెల్మెట్ ధరించి ఉన్నప్పటి.. అతను బంతి తగిలి మరణించాడు.
ఫిలిప్ హ్యూస్ మరణానికి ముందు.. ఉపయోగించిన హెల్మెట్‌కు మెడ భాగం దగ్గర గార్డు లేదు. ఇంతకుముందు హెల్మెట్‌లకు ముందు భాగంలో నెట్ ఉండేది. వెనుక భాగంలో గార్డు ఉండేది కాదు. అందుకే హెల్మెట్ ధరించి కూడా.. బౌన్సర్ ఫిలిప్ మెడకు తగిలి అతను మరణించాడు. ఈ సంఘటన తర్వాత.. ICC హెల్మెట్ రూపకల్పనను మెరుగుపరచాలని నిర్ణయించింది. ఇప్పుడు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా మెడకు రక్షణ కల్పించేందుకు హెల్మెట్ వెనుక భాగంలో గార్డులను ఏర్పాటు చేశారు.
ఫిలిప్ హ్యూస్ 19 ఏళ్ల వయస్సులోనే ఓ టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ సెంచరీలు (115,160) చేసాడు. ఆస్ట్రేలియా తరఫున కెరీర్ తొలి వన్డేలోనే సెంచరీ (112) కొట్టిన బ్యాట్స్‌మన్‌గా అరుదైన రికార్డులు తన పేరిట ఉన్నాయి.