వావ్‌.. క్రికెట్ ప్రేమికుల రోమాలు నిక్కబొడుచుకున్నాయ్

83 Trailer Out. మన దేశంలో క్రికెట్ కు ఉన్న క్రేజ్ అంతా.. ఇంతా కాదు. భారత్ మొదటి సారి క్రికెట్

By Medi Samrat  Published on  30 Nov 2021 12:54 PM IST
వావ్‌.. క్రికెట్ ప్రేమికుల రోమాలు నిక్కబొడుచుకున్నాయ్

మన దేశంలో క్రికెట్ కు ఉన్న క్రేజ్ అంతా.. ఇంతా కాదు. భారత్ మొదటి సారి క్రికెట్ వరల్డ్ కప్ గెలవడానికి ముందు మన జట్టును ఎంత తక్కువగా చూసే వాళ్లో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే 1983 ప్రపంచ కప్ విక్టరీ మనకు ఎప్పటికీ స్పెషల్..! ఇక ఈ వరల్డ్ కప్ గెలవడానికి భారత జట్టు పడ్డ కష్టం.. ఎదుర్కొన్న అవమానాలు చాలానే ఉన్నాయి. అందుకు సంబంధించిన కథతో వస్తున్న సినిమానే '83'. నేడు సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు. క్రికెట్ అభిమానులు ఈ ట్రైలర్ ను చూసి ఫిదా అవుతున్నారు.

రణవీర్ సింగ్ నటించిన '83' చిత్రం భారతదేశం యొక్క మొదటి క్రికెట్ ప్రపంచ కప్ విజయాన్ని మళ్లీ మళ్లీ కళ్లకు కట్టినట్లు చూపించనుంది. క్రికెట్, ఐక్యత మరియు దేశభక్తి యొక్క సమ్మేళనంతో కూడిన ట్రైలర్‌ను మంగళవారం చిత్ర బృందం ఆవిష్కరించింది. 1983 ప్రపంచకప్‌లో అనేక అడ్డంకులు ఎదురైనా టీమ్‌ఇండియా ఎలా ఛాంపియన్‌గా అవతరించింది అనే ప్రయాణం ఈ ట్రైలర్ లో చూపించారు.


కబీర్ ఖాన్ దర్శకత్వం వహించిన '83' సినిమాలో.. ప్రపంచ కప్ విజేత జట్టుకు నాయకత్వం వహించిన కపిల్ దేవ్‌గా రణవీర్ సింగ్ నటించాడు. ట్రైలర్ చూసిన తర్వాత రణవీర్ కపిల్ దేవ్ మ్యానరిజమ్స్‌పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాడని ఖచ్చితంగా చెప్పవచ్చు.తాహిర్ రాజ్ భాసిన్, జీవా, సాకిబ్ సలీమ్, జతిన్ సర్నా, చిరాగ్ పాటిల్, దినకర్ శర్మ, నిశాంత్ దహియా, హార్డీ సంధు, సాహిల్ ఖట్టర్, అమ్మీ విర్క్, అద్దినాథ్ కొఠారే, ధైర్య కర్వా, ఆర్ బద్రీ మరియు పంకజ్ త్రిపాఠి కూడా ఈ స్పోర్ట్స్ డ్రామా సినిమాలో భాగంగా ఉన్నారు.కపిల్ దేవ్ భార్య రోమి పాత్రలో దీపికా పదుకొణె నటించింది.

జూన్ 25, 1983న, లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్‌లో జరిగిన ఫైనల్స్‌లో వెస్టిండీస్‌ను ఓడించడం ద్వారా భారతదేశం తమ మొట్టమొదటి క్రికెట్ ప్రపంచ కప్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. భారత్‌ ఈ విజయం సాధించి ఇప్పటికి 38 ఏళ్లు. ప్రపంచకప్ విజేత జట్టుకు ఆల్ రౌండర్ కపిల్ దేవ్ నాయకత్వం వహించాడు. భారత వరల్డ్ కప్ ఫైనల్ ప్లేయింగ్ ఎలెవన్‌లో సునీల్ గవాస్కర్, కె శ్రీకాంత్, మొహిందర్ అమర్‌నాథ్, యశ్‌పాల్ శర్మ, ఎస్‌ఎం పాటిల్, కపిల్ దేవ్ (సి), కీర్తి ఆజాద్, రోజర్ బిన్నీ, మదన్ లాల్, సయ్యద్ కిర్మాణీ మరియు బల్వీందర్ సంధు ఉన్నారు. డిసెంబర్ 24న థియేటర్లలో విడుదల కానున్న '83' ద్వారా ప్రేక్షకులు ఆ చారిత్రాత్మక ఘట్టాన్ని మళ్లీ తిలకించవచ్చు.


Next Story