టీమిండియా కోచ్‌ రవిశాస్త్రిపై నెటిజన్లు తెగ ట్రోల్స్‌ చేస్తున్నారు. మాజీ క్రికెటర్‌ అనిల్‌ కుంబ్లేతో కలిసి దిగిన ఫొటోని రవిశాస్త్రి సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు. దీంతో రవిశాస్త్రిపై నెటిజన్లు మరోసారి విరుచుకుపడుతున్నారు. రవిశాస్త్రి సోషల్‌ మీడియాలో పోస్టు పెట్టడమే ఆలస్యంగా మారింది. రవిశాస్త్రి ఎప్పుడూ పోస్ట్‌ పెడతారా.. ఎప్పుడూ ట్రోల్‌ చేద్దామన్న ఆలోచనతో నెటిజన్లు చూస్తున్నారు. తాజాగా పింక్‌బాల్‌ టెస్టులో బంగ్లాదేశ్‌పై టీమిండియా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.

టెస్ట్‌ మ్యాచ్‌ గెలిచిన తర్వాత అనిల్‌ కుంబ్లేని కోచ్‌ రవిశాస్త్రి కలిశారు. కుంబ్లేతో దిగిన ఫొటోని రవిశాస్త్రి ట్విటర్‌లో పోస్టు చేశారు. దానికి క్యాప్షన్‌గా గ్రేటెస్ట్‌ పర్సన్‌ని కలవడం చాలా గొప్పగా ఉందని రాశాడు. అనిల్‌ కుంబ్లేను కూడా ఆ పోస్టుకు ట్యాగ్‌ చేశాడు. కాగా రవిశాస్త్రి కన్న ముందు టీమిండియా కోచ్‌గా అనిల్‌ కుంబ్లే పని చేశారు. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీతో విభేదాలు రావడంతో అనిల్‌ కుంబ్లే తన పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత రవిశాస్త్రికి టీమిండియా కోచ్‌గా అవకాశం వచ్చింది. గ్రేటెస్ట్‌ పర్సన్‌ని కలిశానంటూ రవిశాస్త్రి క్యాప్షన్‌ పెట్టడంతో.. అదే భావన ఇద్దరికి ఉందా.. ఓ నెటిజన్‌ కామెంట్‌ చేశాడు. కాగా రకరకాల మీమ్స్‌తో రవిశాస్త్రిని సోషల్‌ మీడియాలో తెగ ట్రోల్‌ చేస్తున్నారు.

అంజి గోనె

నా పేరు గోనె. అంజి. న్యూస్‌మీటర్‌ తెలుగులో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో 99టీవీలో క్షేత్రస్థాయి అధ్యయనం చేశాను. మోజో టీవీలో సంవత్సరం పాటు జర్నలిస్టుగా పనిచేశాను. కలం నా బలం, సమస్యలే నా గళం. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.