త‌మిళ‌నాడులోని అసెంబ్లీ మాజీ స్పీక‌ర్ పీహెచ్ పాండియాన్ (74) శ‌నివారం క‌న్నుమూశారు. గ‌త కొంత‌కాలంగా గుండె సంబంధిత వ్యాధితో బాధ‌ప‌డుతున్న ఆయ‌న వెల్గూరులోని ఓ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ మ‌ర‌ణించారు. కాగా, ఆయ‌న డీఎంకే నుంచి వైదొలిగిన త‌ర్వాత ఎంజీ రామ‌చంద్ర‌న్ స్థాపించిన ఏఐడీఎంకే పార్టీ వ్య‌వ‌స్థాప‌క స‌భ్యుల్లో ఒక‌రిగా చేరారు. చెర‌న్‌మ‌దేవి అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఆయ‌న నాలుగు సార్లుగా ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1985 నుంచి 1989 వ‌ర‌కు అసెంబ్లీ స్పీక‌ర్‌గా త‌న సేవ‌లు అందించారు. ఇక 1999లో తిరునెల్వేలి లోక్ స‌భ నుంచి పార్ల‌మెంట్ స‌భ్యుడిగా విజ‌యం సాధించారు. పాండియ‌న్ స్పీక‌ర్‌గా ఉన్న స‌మ‌యంలో స్పీక‌ర్‌కు ప్ర‌త్యేక అధికారాలు ఉన్నాయంటూ కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్నారు.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.