సౌతాఫ్రికా కెప్టెన్ డుప్లిసెస్ టాస్ వేయడట..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  18 Oct 2019 12:24 PM GMT
సౌతాఫ్రికా కెప్టెన్ డుప్లిసెస్ టాస్ వేయడట..!

రాంచీ: కొంత మంది ఆటను నమ్ముకుంటే..మరికొంత మంది అదృష్టాన్ని నమ్ముకుంటారు. ఇప్పుడు సౌతాఫ్రికా కెప్టెన్ డుప్లిసెస్‌ కూడా అదృష్టాన్నే నమ్ముకుంటున్నారు. ఈ సిరీస్ లో వరుసుగా రెండు సార్లు టీమిండియా కెప్టెన్ కోహ్లీనే టాస్ గెలిచారు. ఇదే..టీమిండియా విజయానికి కారణమని డుప్లిసెస్ నమ్ముతున్నాడు. రేపు (శనివారం) రాంచీలో ఇరు జట్లు మధ్య మూడో టెస్ట్ ప్రారంభం కానుంది. విశాఖపట్నం, పుణెల్లో జరిగిన రెండు టెస్ట్ మ్యాచ్‌లు గెలుచుకుని టీమిండియా సిరీస్ కైవసం చేసుకుంది. అయితే...మూడో టెస్ట్‌లోనైనా తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటున్నాడు సౌతాఫ్రికా కెప్టెన్.

ఇక...డుప్లిసెస్ తన మనసులో మాట బయటపెట్టారు. మూడో టెస్ట్‌కు టాస్‌ కోసం వేరే క్రికెటర్‌ని పంపుతానని ప్రకటించాడు. టాస్‌ల్లో తన రికార్డ్ బాగోలేదని చెప్పుకొచ్చాడు. టాస్ గెలిస్తే..తొలి ఇన్నింగ్స్‌లో భారీగా పరుగులు చేసే అవకాశం లభిస్తుందని డుప్లిసెస్ నమ్ముతున్నాడు. వరుస టెస్ట్‌ల విజయాలతో దూసుకుపోతున్నటీమిండియాను కట్టడి చేయాలంటే..అదృష్టం కలిసి రావాలంటున్నాడు సౌతాఫ్రికా కెప్టెన్.

Next Story
Share it