చివరికి ట్రూకాలర్ iఫోన్ పై పనిచేస్తుంది

ప్రముఖ ప్రపంచవ్యాప్త కమ్యూనికేషన్స్ ప్లాట్ఫార్మ్, ట్రూకాలర్, ఇప్పుడు iఫోన్ కొరకు అతిపెద్ద అప్డేట్ ను అందించింది.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  22 Jan 2025 5:30 PM IST
చివరికి ట్రూకాలర్ iఫోన్ పై పనిచేస్తుంది

ప్రముఖ ప్రపంచవ్యాప్త కమ్యూనికేషన్స్ ప్లాట్ఫార్మ్, ట్రూకాలర్, ఇప్పుడు iఫోన్ కొరకు అతిపెద్ద అప్డేట్ ను అందించింది. ఈ కొత్త అప్డేట్ ప్రతిచోట ట్రూకాలర్ యొక్క స్పామ్ మరియు స్కామ్ బ్లాకింగ్ సామర్థ్యాలను iఫోన్ యూజర్స్ కు అందిస్తుంది! ఇది ఇప్పుడు తన ఆండ్రాయిడ్ ప్రత్యర్ధితో సమానంగా అన్ని రకాల కాల్ ను గుర్తించే సామర్థ్యం కలిగి ఉంది.

ఇది గోప్యత-పరిరక్షణ విధానములో లైవ్ కాలర్ ID ని అందించుటకు ట్రూకాలర్ వంటి యాప్స్ కొరకు అభివృద్ధి చేయబడిన ఆపిల్ యొక్క లైవ్ కాలర్ ID లుక్‎అప్ ఫ్రేమ్‎వర్క్ ద్వారా సాధ్యపడింది. ఈ API స్టేట్-ఆఫ్-ది-ఆర్ట్ హోమోమార్ఫిక్ ఎన్‎క్రిప్షన్ ఉపయోగిస్తుంది మరియు ట్రూకాలర్ కాలర్ ID కొరకు స్కేల్ వద్ద నియోగించుటకు ప్రపంచములోనే మొట్టమొదటిది.

ఒక శక్తివంతమైన ట్రూకాలర్ అనుభవము: ఇప్పుడు iఫోన్ పై

ట్రూకాలర్ 15 సంవత్సరాలుగా అవాంఛనీయ కమ్యూనికేషన్ ఫిల్టర్ చేసే వ్యాపారములో ఉంది. ఈ అప్డేట్ వీలైనన్ని కాల్ ను గుర్తించుటకు ట్రూకాలర్ యొక్క ఆధునిక AI సామర్థ్యాలను మరియు ప్రపంచవ్యాప్త డేటాబేస్ ను అనుకూలపరచగలదు. ట్రూకాలర్ కు దాని గురించి సమాచారము ఉన్నంతవరకు ఏ కాల్ కూడా iOS పై గుర్తించబడకుండా ఉండదని ఇది నిర్ధారిస్తుంది.

అదనంగా, తాజా అప్డేట్ లో ట్రూకాలర్ iOS యూజర్లు ఎంతో కాలంగా అభ్యర్ధిస్తున్నది ఉంది: స్పామ్ కాల్స్ యొక్క ఆటోమాటిక్ బ్లాకింగ్. ఇతర పురోగతులలో ఫోన్ యాప్ లో ఇటీవలి జాబితాలో ఉన్న 2,000 పాత నంబర్ల వరకు వెనక్కు వెళ్ళి, ఇదివరకు గుర్తించబడిన కాల్స్ కొరకు సెర్చ్ చేసే సామర్థ్యం ఉంది.

చివరిగా, iఫోన్ పై ట్రూకాలర్ లో ఒక ప్రీమియం ఫ్యామిలి ప్లాన్ కొరకు సబ్‎స్క్రైబ్ చేసే సామర్థ్యం కూడా ఉంది.ఫ్యామిలీ ప్లాన్ తో, మీరు తక్కువ నెలవారి లేదా వార్షిక ధరకు ట్రూకాలర్ ప్రీమియం ప్రయోజనాలను నలుగురు సభ్యులకు అదనంగా షేర్ చేయవచ్చు.

iOS 18.2 పై ట్రూకాలర్ ను ఎలా సక్రియం చేయాలి

iఫోన్ వర్షన్ 14.0 లేదా ఆ తరువాతి వర్షన్స్ కొరకు ట్రూకాలర్ పై మీరు ఉన్నారని నిర్ధారించుకోండి.

iఫోన్ సెట్టింగ్స్ ఓపెన్ చేయండి>యాప్స్>ఫోన్>కాల్ బ్లాకింగ్ & గుర్తింపు

ఇక్కడ, ట్రూకాలర్ స్విచ్ లను సక్రియం చేయండి మరియు ట్రూకాలర్ యాప్ ను మళ్ళీ ఓపెన్ చేయండి.

రిషిత్ ఝున్‎ఝున్‎వాలా, సీఈఓ, ట్రూకాలర్ ఇలా అన్నారు, “ట్రూకాలర్ యొక్క పూర్తి సామర్థ్యాన్ని మీకు అందిస్తున్నందుకు మేము చాలా సంతోషంగా ఉన్నాము. మా iఫోన్ యూజర్ బేస్ లో అద్భుతమైన సామర్థ్యం మరియు అభివృద్ధిని మేము చూస్తున్నాము మరియు ట్రూకాలర్ యొక్క ఆండ్రాయిడ్ అనుభవముతో సమానత్వము వారి కోరికల జాబితాలో అన్నిటికన్నా ముందు ఉంది. ఈ అప్డేట్ అన్ని కాలింగ్ కార్యకలాపాలకు గోప్యతను పరిరక్షిస్తూనే ఆ పని మరియు మరెంతో చేస్తుంది.”

అన్ని కొత్త ఫీచర్స్ ఇప్పుడు ట్రూకాలర్ ప్రీమియం యూజర్స్ కొరకు అందుబాటులోకి తేబడతాయి. iOS పై ఉచిత యూజర్లు యాడ్-మద్ధతు ఉన్న నంబర్ సెర్చ్ ను మరియు వెరిఫైడ్ వ్యాపారాల కాలర్ IDని ఆనందిస్తారు

స్పామ్ యొక్క ఆటో బ్లాకింగ్ ప్రపంచవ్యాప్తంగా ఈరోజు నుండే అందుబాటులో ఉంది & కొత్త కాలర్ ID విస్తరించబడుతుంది. రాబోయే రోజులలో ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూజర్లు అందరికి అందుబాటులో ఉంటుంది. ఉత్పత్తి వీడియోను మీరు ఇక్కడ చూడవచ్చు.

Next Story