టీ నాణ్యత గురించి తెలంగాణలో వినియోగదారులకు అవగాహన కల్పించటానికి ఒక కార్యక్రమంను ప్రారంభించనున్న టాటా టీ చక్ర గోల్డ్ జెమిని

తెలంగాణలో ఎక్కువమంది అభిమానించే టీ బ్రాండ్ అయిన టాటా టీ చక్ర గోల్డ్ జెమిని, టీ నాణ్యత యొక్క ప్రాముఖ్యత మరియు కల్తీ లేదా రంగులు, టీ ఆకు వాసనలు వచ్చే రసాయనాలు కలిపి విడిగా విక్రయించే టీ వల్ల కలిగే సంభావ్య ప్రమాదాల గురించి వినియోగదారులకు అవగాహన కల్పించడానికి ఒక కార్యక్రమంను ప్రారంభించనుంది

By న్యూస్‌మీటర్ తెలుగు
Published on : 3 Jun 2025 4:30 PM IST

టీ నాణ్యత గురించి తెలంగాణలో వినియోగదారులకు అవగాహన కల్పించటానికి ఒక కార్యక్రమంను ప్రారంభించనున్న టాటా టీ చక్ర గోల్డ్ జెమిని

తెలంగాణలో ఎక్కువమంది అభిమానించే టీ బ్రాండ్ అయిన టాటా టీ చక్ర గోల్డ్ జెమిని, టీ నాణ్యత యొక్క ప్రాముఖ్యత మరియు కల్తీ లేదా రంగులు, టీ ఆకు వాసనలు వచ్చే రసాయనాలు కలిపి విడిగా విక్రయించే టీ వల్ల కలిగే సంభావ్య ప్రమాదాల గురించి వినియోగదారులకు అవగాహన కల్పించడానికి ఒక కార్యక్రమంను ప్రారంభించనుంది. *దేశవ్యాప్తంగా అనేక మార్కెట్లలో రసాయనిక రంగులు కలిపిన టీలు అందించటం సర్వసాధారణంగా మారింది. "టీ (తుది ఉత్పత్తి/తయారు చేసిన టీ) అప్పుడప్పుడు అనుమతించబడని అదనపు రంగు పదార్థాలను కలిగి ఉంటుంది, దీనిని కల్తీ టీ అని పిలుస్తారు. ఉత్పత్తికి అనువైన రంగు లేదా మెరుపును ఇవ్వడానికి నాసిరకం టీ ఆకులకు బిస్మార్క్ బ్రౌన్, పొటాషియం బ్లూ, పసుపు, ఇండిగో, ప్లంబాగో మొదలైన రంగులు కలుపుతారని అప్పుడప్పుడు నివేదికలు సూచిస్తున్నాయి." టాటా టీ చక్ర గోల్డ్ జెమిని ఇప్పుడు ఈ అంశాల పట్ల అవగాహన పెంచడం మరియు అటువంటి పద్ధతుల యొక్క దుష్ప్రభావాలను వినియోగదారులు అర్థం చేసుకునేలా చేయడం లక్ష్యంగా పెట్టుకుంది, విశ్వసనీయ బ్రాండ్ నుండి సురక్షితమైన, అధిక-నాణ్యత గల ప్యాకేజ్డ్ టీ వైపు వినియోగదారులు మళ్లడాన్ని ప్రోత్సహిస్తుంది.

కృత్రిమ రంగులు కలిపిన టీ ఆకు ఉపయోగించి చేసిన టీ కారణంగా కలిగే సంభావ్య ఆరోగ్య ప్రమాదాల గురించి మరియు కల్తీ , కల్తీ లేని టీ మధ్య తేడాను ఎలా గుర్తించాలో తెలంగాణ వినియోగదారులలో అవగాహన కల్పించడానికి టాటా టీ చక్ర గోల్డ్ జెమిని ప్రయత్నిస్తోంది. ఆ ప్రయత్నాలలో భాగంగా, దాని చల్లని నీటి పరీక్షతో కూడిన ఇంటింటికీ అవగాహన ప్రచారం ద్వారా ఈ బ్రాండ్ ఈ ప్రాంతంలోని 30,000 కంటే ఎక్కువ గృహాలను చేరుకుంది.

టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ - ప్యాకేజ్డ్ బేవరేజెస్ (ఇండియా & దక్షిణాసియా) అధ్యక్షుడు పునీత్ దాస్ మాట్లాడుతూ, టాటా టీ చక్ర గోల్డ్ జెమిని వద్ద , మా నిబద్ధత గొప్ప నాణ్యత గల కప్పు టీని అందించడం కంటే ఎక్కువగా ఉంటుంది; ఇది మా వినియోగదారుల భద్రత మరియు శ్రేయస్సును నిర్ధారించడం వరకు విస్తరించింది. కల్తీ టీ వల్ల కలిగే ప్రమాదాల గురించి తెలంగాణ ప్రజలకు అవగాహన కల్పించడం, వారికి సమాచారం అందించడం, తగిన సమాచారంతో కూడిన ఎంపికలు చేసుకోవడంలో వారికి సహాయపడటం మా అవగాహన కార్యక్రమ లక్ష్యం. విశ్వసనీయమైన, అధిక-నాణ్యత గల ప్యాకేజ్డ్ టీని ఎంచుకోవడం ద్వారా ప్రతి ఒక్కరూ మా మిషన్‌లో చేరాలని మేము ప్రోత్సహిస్తున్నాము..." అని అన్నారు.

హైదరాబాద్‌కు చెందిన ప్రసిద్ధ పోషకాహార నిపుణులు డాక్టర్ అడ్డూ కిరణ్మయి మాట్లాడుతూ , “ఈ ప్రాంతంలోని తెలుగు కుటుంబాలు ఎంతో ఇష్టపడే పానీయంగా టీ నిలుస్తుంది. ప్రతి రోజూ పలుమార్లు వారు ఈ టీ ని ఆస్వాదిస్తుంటారు. కల్తీ టీ తాగడం వల్ల , ప్రధానంగా ఈ టీలలో ఉండే వివిధ హానికరమైన పదార్థాల వల్ల అనేక ఆరోగ్య ప్రమాదాలు తలెత్తుతాయి. కొన్ని సంభావ్య ఆరోగ్య ప్రభావాలలో అతిసారం, వికారం, గ్యాస్ట్రిక్ చికాకు, తలనొప్పి మరియు తలతిరగడం వంటివి ఉన్నాయి. తగిన సమాచారం తెలుసుకోవటం మరియు జాగ్రత్తగా ఉండటం ద్వారా, వినియోగదారులు కల్తీ టీ తీసుకోవడం వల్ల కలిగే ప్రతికూల ప్రభావాల నుండి తమను తాము రక్షించుకోవచ్చు, స్వచ్ఛమైన, అధిక-నాణ్యత గల ప్యాకేజ్డ్ టీ ప్రయోజనాలను ఆస్వాదించడం కొనసాగించవచ్చు” అని అన్నారు.

టాటా టీ చక్ర గోల్డ్ జెమిని విశ్వసనీయ టాటా టీ కుటుంబంలో భాగం, అస్సాంలోని బ్రహ్మపుత్ర నది యొక్క పచ్చని లోయల నుండి ఎంపిక చేసిన అత్యుత్తమ టీ ఆకు ల నుండి తయారు చేయబడిన ప్రీమియం మిశ్రమానికి ఇది ప్రసిద్ధి చెందింది.

Next Story