'రాహుల్‌ గాంధీకి తమిళ అమ్మాయితో పెళ్లి చేస్తాం'

Tamil Nadu women talk about Rahul Gandhi's marriage. 'భారత్‌ జోడో యాత్ర'లో భాగంగా కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ చాలా బిజీ అయ్యారు. ప్రస్తుతం కేరళ, తమిళనాడు సరిహద్దుల్లో

By అంజి  Published on  12 Sep 2022 2:32 AM GMT
రాహుల్‌ గాంధీకి తమిళ అమ్మాయితో పెళ్లి చేస్తాం

'భారత్‌ జోడో యాత్ర'లో భాగంగా కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ చాలా బిజీ అయ్యారు. ప్రస్తుతం కేరళ, తమిళనాడు సరిహద్దుల్లో కొనసాగుతోంది. ఈ యాత్రలో భాగంగా అనేకమందితో రాహుల్‌ చర్చలు జరుపుతున్నారు. చిన్నారుల నుంచి పెద్దల వరకు, అందరినీ కలిసి మాట్లాడుతున్నారు. ఈ క్రమంలోనే రాహుల్‌ గాంధీ పెళ్లికి సంబంధించిన ఓ సంఘటన జరిగింది. తమిళనాడులోని ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ మహిళా వర్కర్లతో రాహుల్‌ గాంధీ కలిసినప్పుడు.. వారు రాహుల్‌ పెళ్లి గురించి మాట్లాడారు. దీనికి సంబంధించిన వివరాలను కాంగ్రెస్‌ నేత జైరాం రమేష్‌ ట్విటర్‌లో పేర్కొన్నారు.

''మార్తాండంలో ఎంజీఎన్​ఆర్​ఈజీఏ మహిళా వర్కర్లని రాహుల్​ గాంధీ కలిశారు. వారిలో ఓ మహిళ 'మీకు తమిళనాడు ఇష్టం అని మాకు తెలుసు. మీకు తమిళ అమ్మాయితో పెళ్లి జరిపిస్తామని మాట్లాడింది. ఆ మాట విని రాహుల్​ గాంధీ నవ్వుకున్నారు. ఫొటోలో స్పష్టంగా తెలిసిపోతోంది.'' అని జైరాం రమేశ్​ ట్వీట్​ చేశారు. షెడ్యూల్‌ ప్రకారం.. తిరువనంతపురంలోని అగ్రికల్చర్‌ యూనివర్సిటీలో రాహుల్‌ బస చేయాల్సి ఉంది. అనుమతులు లభించిన తర్వాత.. దీనికి వ్యతిరేకంగా కేరళ సీపీఎం విద్యార్థి విభాగం నిరసనకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలోనే రాహుల్ గాంధీ ఆదివారం రాత్రి తిరువనంతపురంలోని ఒక పాఠశాలలో బస చేశారు.

యాత్రను వివాదాలకు దూరంగా ఉంచాలని కోరుకుంటున్నామని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. కాంగ్రెస్​ జోడో యాత్ర.. 150 రోజుల పాటు సాగనుంది. మొత్తం మీద 12 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లో భారత్​ జోడో యాత్రలో జరగనుంది. కన్యాకుమారి నుంచి జమ్ముకశ్మీర్​ వరకు 3,750కిలోమీటర్ల యాత్ర సాగనుంది. ఈ క్రమంలో 22 ప్రధాన నగరాల్లో మెగా ర్యాలీలు నిర్వహించనున్నారు రాహుల్​ గాంధీ.

Next Story
Share it