ఆ రెండు రోజులు.. తమిళనాడులో బీచ్‌లు మూసివేత

Tamil Nadu govt closes beaches for New Year celebrations. తమిళనాడులో డిసెంబర్ 31, జనవరి 1 తేదీలలో బీచ్‌లు మూసివేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. కరోనా వైరస్‌ యొక్క ఓమిక్రాన్‌ వేరియంట్ నుండి

By అంజి  Published on  15 Dec 2021 5:15 AM GMT
ఆ రెండు రోజులు.. తమిళనాడులో బీచ్‌లు మూసివేత

తమిళనాడులో డిసెంబర్ 31, జనవరి 1 తేదీలలో బీచ్‌లు మూసివేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. కరోనా వైరస్‌ యొక్క ఓమిక్రాన్‌ వేరియంట్ నుండి ముప్పు పొంచి ఉన్నందున ఎంకె. స్టాలిన్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. "కోవిడ్ -19 వ్యాప్తిని అరికట్టడానికి ఉద్దేశించిన చర్యల్లో భాగంగా డిసెంబర్ 31, 2021, జనవరి 1, 2022 న అన్ని బీచ్‌ల్లోకి ప్రజలకు ప్రవేశం ఉండదు" అని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ ఉటంకిస్తూ ప్రభుత్వ పత్రికా ప్రకటన పేర్కొంది. కొత్త వేరియంట్, దక్షిణాఫ్రికాలో మొదట కనుగొనబడింది, డెల్టా వేరియంట్ కంటే ఎక్కువగా ఇది వ్యాప్తి చెందుతోందని తెలిసింది. ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఓమిక్రాన్‌ వేరియంట్ ఆఫ్ కన్సర్న్ (VoC)గా వర్గీకరించింది. ఇది కొన్ని దేశాల్లో కోవిడ్-19 మహమ్మారిని మళ్లీ విజృంభించేలా చేయొచ్చిన హెచ్చరించింది.

చెన్నైలోని మెరీనా బీచ్, బెసెంట్ నగర్ బీచ్‌లు నూతన సంవత్సరం వంటి వేడుకలు జరుపుకునే సందర్భాలలో.. ప్రజలకు అత్యంత ఇష్టమైన ప్రదేశాలు. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఈ రెండు బీచ్‌లకు ప్రజలు భారీగా తరలివస్తుంటారు. ప్రస్తుతం ఉన్న కోవిడ్ సంబంధిత ఆంక్షలను డిసెంబర్ 31 వరకు పొడిగిస్తున్నట్లు స్టాలిన్ తెలిపారు. సామాజిక, సాంస్కృతిక, రాజకీయ సమావేశాలపై ఆంక్షలు కొనసాగుతాయి. అయితే, తమిళనాడు ప్రభుత్వం స్విమ్మింగ్ పూల్స్ క్రియాత్మకంగా తెరిచి ఉంచడానికి అనుమతించింది. జనవరి 3, 2022 నుండి 6-12 తరగతులకు పాఠశాలల్లో బోధన సాధారణంగానే కొనసాగుతుంది. కళాశాలలు, సాంకేతిక శిక్షణా సంస్థలకు ఇదే నియమం వర్తిస్తుందని తమిళనాడు ప్రభుత్వం తెలిపింది.

Next Story