9,400 మంది యువతకు శిక్షణనందించేందుకు ‘దోస్త్ సేల్స్’ కార్యక్రమాన్ని విస్తరించిన శామ్‌సంగ్

శామ్‌సంగ్, భారతదేశపు అతిపెద్ద వినియోగదారు ఎలక్ట్రానిక్స్ బ్రాండ్, తన ఫ్లాగ్‌షిప్ ‘శామ్‌సంగ్ డిజిటల్ & ఆఫ్‌లైన్ స్కిల్స్ ట్రైనింగ్ (దోస్త్) సేల్స్’ కార్యక్రమాన్ని భారీ స్థాయిలో విస్తరించింది.

By -  న్యూస్‌మీటర్ తెలుగు
Published on : 28 Nov 2025 7:27 PM IST

9,400 మంది యువతకు శిక్షణనందించేందుకు ‘దోస్త్ సేల్స్’ కార్యక్రమాన్ని విస్తరించిన శామ్‌సంగ్

శామ్‌సంగ్, భారతదేశపు అతిపెద్ద వినియోగదారు ఎలక్ట్రానిక్స్ బ్రాండ్, తన ఫ్లాగ్‌షిప్ ‘శామ్‌సంగ్ డిజిటల్ & ఆఫ్‌లైన్ స్కిల్స్ ట్రైనింగ్ (దోస్త్) సేల్స్’ కార్యక్రమాన్ని భారీ స్థాయిలో విస్తరించింది. ఈ చొరవలో భాగంగా, తక్కువ సేవలు అందే కమ్యూనిటీలకు చెందిన 9,400 మంది యువతకు ఫ్రంట్‌లైన్ రిటైల్ పాత్రల కోసం శిక్షణ ఇవ్వబడుతుంది. నైపుణ్యం కలిగిన, భవిష్యత్తు-సిద్ధంగా ఉన్న శ్రామిక వర్గాన్ని తీర్చిదిద్దడం ద్వారా సమ్మిళిత ఆర్థిక వృద్ధి లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లాలన్న శామ్‌సంగ్ నిబద్ధతను ఈ విస్తరణ మరింత బలోపేతం చేస్తుంది.

2021లో ప్రారంభించినప్పటి నుండి, దోస్త్ సేల్స్ ప్రోగ్రామ్ భారతదేశం యొక్క వేగంగా విస్తరిస్తున్న వ్యవస్థీకృత రిటైల్ రంగానికి బలమైన టాలెంట్ పైప్‌లైన్‌ను సృష్టించింది. ఈ సంవత్సరం ప్రారంభమైన దోస్త్ సేల్స్ 4.0 తో, ఎలక్ట్రానిక్స్ సెక్టార్ స్కిల్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ESSCI) మరియు టెలికాం సెక్టార్ స్కిల్స్ కౌన్సిల్ (TSSC) భాగస్వామ్యంతో శామ్‌సంగ్ తన స్కిల్లింగ్ మిషన్‌ను రెట్టింపు చేస్తోంది.

“దేశ అభివృద్ధి యాత్రలో అర్థవంతమైన పాత్ర పోషించేందుకు భారత యువతకు సాధికారత కల్పించాలన్న శామ్‌సంగ్ యొక్క నిబద్ధత అచంచలంగా ఉంది. పరిశ్రమలో తొలి ప్రయత్నంగా నిలిచిన ‘దోస్త్ సేల్స్’ ప్రోగ్రామ్, ముఖ్యంగా తక్కువ సేవలు అందే వర్గాలకు చెందిన యువతకు నేటి మారుతున్న రిటైల్ రంగంలో రాణించడానికి అవసరమైన విశ్వాసం, జ్ఞానం మరియు ఆచరణాత్మక నైపుణ్యాలను అందించడానికి రూపొందించబడిన ఐదు నెలల శిక్షణా కార్యక్రమం. ఈ ఏడాది నమోదు మూడు రెట్లు పెరగడం, డిజిటల్ స్వీకరణ వేగవంతమవుతున్న మరియు రిటైల్ రూపురేఖలు మారుతున్న సమయంలో, ఉపాధి-సిద్ధమైన బలమైన ప్రతిభావనరులను తయారు చేయడంలో దోస్త్ కార్యక్రమం కీలక పాత్ర పోషిస్తున్నదని స్పష్టం చేస్తోంది," అని శుభమ్ ముకర్జీ, హెడ్, సిఎస్ఆర్ & కార్పొరేట్ కమ్యూనికేషన్స్, శామ్‌సంగ్ నైరుతి ఆసియా తెలిపారు.

నిర్మాణాత్మక, పరిశ్రమ అవసరాలకు అనుగుణమైన శిక్షణా మార్గం

ప్రతి ట్రైనీ ESSCI మరియు TSSC నుండి సర్టిఫైడ్ ట్రైనర్ల నేతృత్వంలో 120 గంటల ఆన్లైన్ తరగతి గది మాడ్యూల్‌తో పాటు శామ్‌సంగ్ రిటైల్ సేల్స్ టీమ్ ద్వారా 60 గంటల శిక్షణ పొందుతారు. పాఠ్యప్రణాళికలో ఇవి ఉంటాయి:

● కస్టమర్ ఇంటరాక్షన్ మరియు కమ్యూనికేషన్

● అమ్మకాల ప్రాథమిక అంశాలు మరియు రిటైల్ ప్రక్రియలు

● ప్రోడక్ట్ పరిజ్ఞానం మరియు ప్రదర్శన నైపుణ్యాలు

● నిల్వ కార్యకలాపాలు మరియు సేవా శ్రేష్ఠత

దేశవ్యాప్తంగా ఉన్న శామ్‌సంగ్ రిటైల్ స్టోర్లలో 5 నెలల ఆన్-ద-జాబ్ ట్రైనింగ్ (OJT) సమయంలో, అభ్యర్థులు కస్టమర్ ఎంగేజ్‌మెంట్, స్టోర్ కార్యకలాపాలు, ప్రోడక్టులపై పరిజ్ఞానం మరియు సేల్స్ కన్వర్షన్ వంటి కీలక రంగాల్లో అనుభవాన్ని సంపాదిస్తారు. శిక్షణ కాలమంతా వారి అభ్యాస ప్రయాణానికి మద్దతుగా శామ్‌సంగ్ నెలవారీ స్టైపెండ్‌ను కూడా అందిస్తుంది.

అసెస్‌మెంట్ పూర్తి చేసిన తరువాత, అర్హులైన అభ్యర్థులు ప్రభుత్వ గుర్తింపు పొందిన నేషనల్ స్కిల్స్ క్వాలిఫికేషన్స్ ఫ్రేమ్‌వర్క్ (NSQF) అనుసరణతో కూడిన సర్టిఫికేషన్‌ను పొందుతారు. ఈ సర్టిఫికేషన్‌ వారి ఉపాధి అవకాశాలను గణనీయంగా పెంచడమే కాకుండా, దేశంలోని వ్యవస్థీకృత రిటైల్ రంగంలో దీర్ఘకాలిక కెరీర్‌లకు దారిని సుగమం చేస్తుంది.

తదుపరి తరానికి చెందిన రిటైల్ నిపుణులను తీర్చిదిద్దడం

శామ్‌సంగ్ యొక్క DOST సేల్స్ ప్రోగ్రామ్ ద్వారా, యువ అభ్యర్థులకు కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ రిటైల్‌లో స్థిరమైన కెరీర్ నిర్మించడానికి అవసరమైన ప్రాథమిక నైపుణ్యాలను అందిస్తోంది. నిర్మాణాత్మకంగా రూపొందించిన పాఠ్యక్రమం, కస్టమర్‌లకు ప్రోడక్టు సమాచారం, డెమోలు మరియు కొనుగోలు నిర్ణయాలలో మార్గనిర్దేశం చేసే సేల్స్ ప్రమోటర్‌ల వంటి ఫ్రంట్‌లైన్ పాత్రలకు వారిని సిద్ధం చేస్తుంది.

“భారతదేశ నైపుణ్య అభివృద్ధి పర్యావరణాన్ని బలోపేతం చేసి, యువతకు సాధికారత కల్పించే DOST సేల్స్ ప్రోగ్రామ్‌లో శామ్‌సంగ్‌తో భాగస్వామ్యం చేసుకోవడం పట్ల ESSCI గర్వపడుతుంది. ఈ సహకారం ఉపాధి అవకాశాలను మెరుగుపరచడంలోనే కాక సమ్మిళిత ఆర్థిక వృద్ధిని కూడా ప్రోత్సహిస్తోంది. అత్యుత్తమ నాణ్యత గల శిక్షణ, పరిశ్రమకు అనుగుణంగా ఉండే ప్రమాణాలు మరియు భారత యువశక్తికి దీర్ఘకాలిక కెరీర్ మార్గాలను సృష్టించడంపై ఉన్న మా ఉమ్మడి నిబద్ధతను ఇది మరింత బలోపేతం చేస్తోంది,” అని మిస్టర్ వినోద్ శర్మ, చైర్మన్, ESSCI అన్నారు.

“భారతదేశం వేగంగా ఎదుగుతున్న డిజిటల్ ఎకానమీకి అవసరమైన నైపుణ్యాలను కలిగిన శ్రామిక శక్తిని తయారుచేయడం మా ప్రధాన లక్ష్యం. ఈ దిశగా, DOST సేల్స్ ప్రోగ్రామ్ ద్వారా శామ్‌సంగ్‌తో మా భాగస్వామ్యం రిటైల్ రంగానికి అవసరమైన ఉన్నత శ్రేణి నైపుణ్యాలను యువతకు అందించడంలో కీలక పాత్ర పోషిస్తోంది. ఈ ప్రోగ్రామ్ సాధారణ శిక్షణను దాటి, నైపుణ్యాలను అర్థవంతమైన ఉపాధి అవకాశాలుగా మార్చి, దీర్ఘకాలిక కెరీర్ మార్గాలను సృష్టించే సామర్థ్యాన్ని కల్పిస్తోంది. అంతేకాక, ఇప్పటివరకు నిర్మాణాత్మక నైపుణ్య శిక్షణకు పరిమిత ప్రాప్తి ఉన్న వర్గాలను ప్రధాన ప్రవాహంలోకి తీసుకువచ్చి, వారి సాధికారతను మరింత బలోపేతం చేస్తోంది.” అని లెఫ్టినెంట్ జనరల్ మిస్టర్. కె. హెచ్. గవాస్, CEO, TSSC తెలిపారు.

మెరుగైన స్థాయిలో ప్రభావాన్ని కొనసాగించడం: సమ్మిళిత వృద్ధికి నైపుణ్యాభివృద్ధి

డిజిటల్ ఇండియాను మరింత శక్తివంతం చేయాలన్న శామ్‌సంగ్ దృష్టిని DOST సేల్స్ ప్రోగ్రామ్ మరింత బలోపేతం చేస్తోంది. నైపుణ్యాభివృద్ధికి మద్దతు ఇవ్వడం ద్వారా, సామాజికంగా మరియు భౌగోళికంగా విభిన్న వర్గాలకు చెందిన యువత అర్ధవంతమైన ఉపాధి అవకాశాలను పొందేలా ఈ కార్యక్రమం మార్గం సుగమం చేస్తోంది. జాతీయ నైపుణ్యాభివృద్ధి మిషన్‌లతో సమలేఖనం చేయడం ద్వారా, ప్రభుత్వ ఆధ్వర్యంలోని సెక్టార్ స్కిల్ కౌన్సిళ్లతో శామ్‌సంగ్ సన్నిహితంగా పనిచేయడం ద్వారా భారతదేశ రిటైల్ టాలెంట్ ల్యాండ్‌స్కేప్‌ను పునర్నిర్మాణం చేయడంలో ఈ భాగస్వామ్యం కీలక పాత్ర పోషిస్తోంది.

DOST సేల్స్ 4.0 శామ్‌సంగ్ యొక్క నిబద్ధతలో మరో కీలక అడుగు, ఇది నైపుణ్య అంతరాలను తగ్గించి సమ్మిళిత, స్థిరమైన వృద్ధిని ప్రోత్సహించడం మరియు భారతదేశ యువతను దేశ డిజిటల్ మరియు ఆర్థిక పరివర్తనలో ఆత్మవిశ్వాసంగా పాల్గొనడానికి సన్నద్ధం చేస్తుంది.

Next Story