శాంసంగ్ కేర్+ సేవలు ఇప్పుడు గృహోపకరణాలకూ విస్తరణ

భారతదేశపు అగ్రగామి కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ శాంసంగ్, తమ 'శాంసంగ్ కేర్+' సేవను విస్తరిస్తున్నట్లు నేడు ప్రకటించింది.

By -  న్యూస్‌మీటర్ తెలుగు
Published on : 12 Nov 2025 8:14 PM IST

శాంసంగ్ కేర్+ సేవలు ఇప్పుడు గృహోపకరణాలకూ విస్తరణ

భారతదేశపు అగ్రగామి కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ శాంసంగ్, తమ 'శాంసంగ్ కేర్+' సేవను విస్తరిస్తున్నట్లు నేడు ప్రకటించింది. ఇందులో భాగంగా రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు, ఎయిర్ కండిషనర్లు, మైక్రోవేవ్ ఓవెన్లు, స్మార్ట్ టీవీల వంటి గృహోపకరణాల (Home Appliances) కోసం 'ఎక్స్‌టెండెడ్ వారంటీ' ప్లాన్లను అందిస్తోంది.

దేశవ్యాప్తంగా ఇళ్లలో పండుగ సంబరాలు జరుపుకుంటున్న వేళ, శాంసంగ్ ఈ పండుగ కాలాన్ని మరింత ఆనందదాయకంగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం వినియోగదారులకు మెరుగైన రక్షణ, సౌకర్యాన్ని అందించడం ద్వారా వారికి మరింత మనశ్శాంతిని కలిగించనుంది. కస్టమర్లు ఇప్పుడు 1 నుండి 4 సంవత్సరాల వరకు ప్లాన్లను ఎంచుకోవచ్చు. ఇవి సమగ్ర రక్షణ, సౌలభ్యాన్ని అందిస్తాయి, వీటి ధరలు రోజుకు కేవలం రూ. 2 నుండే ప్రారంభమవుతాయి.

ఈ మెరుగైన శాంసంగ్ కేర్+ సేవ... పరిశ్రమలోనే మొట్టమొదటిసారిగా సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లు, (భౌతిక నష్టం లేని) స్క్రీన్ సమస్యలకు (screen malfunctions) కూడా కవరేజీని పరిచయం చేస్తోంది.

ఇది కస్టమర్లకు పూర్తి మనశ్శాంతిని ఇస్తుంది. కేవలం హార్డ్‌వేర్ సమస్యలకే కాకుండా, సాఫ్ట్‌వేర్ పనితీరు, డిస్‌ప్లే సంబంధిత సమస్యలకు కూడా భరోసా లభిస్తుంది. దీంతో శాంసంగ్ కేర్+ పరిశ్రమలోనే అత్యంత సమగ్రమైన అప్లయన్స్ ప్రొటెక్షన్ ప్రోగ్రామ్‌గా నిలుస్తుంది.

"కస్టమర్ అనుభూతిని మెరుగుపరచడానికి మేము కట్టుబడి ఉన్నాము. సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లు, స్క్రీన్ సమస్యల కవరేజ్ వంటి ప్రత్యేక ప్రయోజనాలతో గృహోపకరణాల ఓనర్‌షిప్ అనుభవాన్ని ఉన్నత స్థాయికి తీసుకువెళుతున్నాము. అదే సమయంలో శాంసంగ్ కేర్+ ఎక్స్‌టెండెడ్ వారంటీ ప్లాన్‌ల లభ్యతను అన్ని ఛానెళ్లలో విస్తరిస్తున్నాము," అని శాంసంగ్ ఇండియా, డిజిటల్ అప్లయన్సెస్ వైస్ ప్రెసిడెంట్ గుఫ్రాన్ ఆలం అన్నారు.

నైపుణ్యం, విస్తరణ , విశ్వసనీయత , వేగం, స్మార్ట్ సర్వీస్, రక్షణ సుస్థిరత అనే మూలస్తంభాలపై శాంసంగ్ కేర్+ నిర్మించబడింది. ఇది 13,000 మందికి పైగా శాంసంగ్-సర్టిఫైడ్ ఇంజనీర్లు, 2,500కు పైగా సర్వీస్ సెంటర్లు, 100% అసలైన శాంసంగ్ పార్ట్‌ల యాక్సెస్‌ను వినియోగదారులకు అందిస్తుంది, సకాలంలో, అత్యుత్తమ నాణ్యమైన సేవకు హామీ ఇస్తుంది.

కస్టమర్లు తొమ్మిది భాషలలో బహుళ-భాషా మద్దతును పొందుతారు. అదే సమయంలో శాంసంగ్ యాప్ ద్వారా కస్టమర్లు తమ సర్వీస్‌లను ట్రాక్ చేయవచ్చు, షెడ్యూల్డ్ మెయింటెనెన్స్ కోసం సకాలంలో రిమైండర్‌లను పొందవచ్చు.

Next Story