పరుగుల రాణి పీటీ ఉష‌పై.. చీటింగ్‌ కేసు న‌మోదు చేసిన పోలీసులు

P.T. Usha, six others booked in cheating case in Kerala. పరుగుల రాణి, ఒలింపియన్ పీటీ ఉష పై కేరళ రాష్ట్రంలోని వెల్లయిల్ పోలీసులు కేసు నమోదు చేశారు. అనుమానిత రియాల్టీ మోసంలో

By అంజి  Published on  19 Dec 2021 5:02 AM GMT
పరుగుల రాణి పీటీ ఉష‌పై.. చీటింగ్‌ కేసు న‌మోదు చేసిన పోలీసులు

పరుగుల రాణి, ఒలింపియన్ పీటీ ఉష పై కేరళ రాష్ట్రంలోని వెల్లయిల్ పోలీసులు కేసు నమోదు చేశారు. అనుమానిత రియాల్టీ మోసంలో ఉషతో పాటు మరో ఆరుగురు ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మాజీ అంతర్జాతీయ అథ్లెట్ జెమ్మా జోసెఫ్ ఫిర్యాదు ఆధారంగా పీటీ ఉషతో పాటు మరో ఆరుగురిపై భారతీయ శిక్షాస్మృతి (IPC) సెక్షన్ 420 (మోసం మరియు నిజాయితీగా ఆస్తి పంపిణీని ప్రేరేపించినందుకు శిక్ష) కింద కేసు నమోదు చేయబడింది.

కోజికోడ్‌ నగరంలో జెమ్మా జోసెఫ్ 1,012 చదరపు అడుగుల ఫ్లాట్‌ను ఓ బిల్డర్‌ దగ్గరి నుంచి కొనుగోలు చేసింది. బిల్డర్‌తో సంబంధం ఉన్న నిందితులు వివిధ వాయిదాలలో రూ. 46 లక్షలు చెల్లించి నగరంలో బుక్ చేసిన 1,012 చదరపు అడుగుల ఫ్లాట్‌ను అందజేస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చలేదని పోలీసు వర్గాలు తెలిపాయి. తనకు సంబంధం ఉన్న ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేసి ఇస్తామని పీటీ ఉష ఇచ్చిన హామీ మేరకు బిల్డర్లకు డబ్బులు అందజేసినట్లు జెమ్మా జోసెఫ్‌ తెలిపారు. కానీ ఫ్లాట్ ఇవ్వ‌డంలో జాప్యం జ‌రుగుతోంద‌ని జోసెఫ్ చెప్పారు. బిల్డ‌ర్‌తో పాటు పీటీ ఉష త‌న‌ను మోసం చేశార‌ని జోసెఫ్ ఆరోపించారు.

Next Story
Share it