గ్లోబల్ టొయోటా డ్రీమ్ కార్ ఆర్ట్ కాంటెస్ట్‌లో విజేతలలో ఒకరిగా గుర్తింపు పొందిన పేరూరి లక్ష్మీ సహస్ర

ప్రతిష్టాత్మకమైన 17వ టొయోటా డ్రీమ్ కార్ ఆర్ట్ కాంటెస్ట్ (టిడిసిఏసి) గ్లోబల్‌ పోటీ లో ఫైనలిస్టులలో ఒకరిగా ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంకు చెందిన యువ కళాకారిణి కుమారి పేరూరి లక్ష్మీ సహస్ర ఎంపికైనందుకు, టొయోటా కిర్లోస్కర్ మోటార్ (టికెఎం) ఇటీవల సత్కరించింది.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  25 Sep 2024 11:00 AM GMT
గ్లోబల్ టొయోటా డ్రీమ్ కార్ ఆర్ట్ కాంటెస్ట్‌లో విజేతలలో ఒకరిగా గుర్తింపు పొందిన పేరూరి లక్ష్మీ సహస్ర

ప్రతిష్టాత్మకమైన 17వ టొయోటా డ్రీమ్ కార్ ఆర్ట్ కాంటెస్ట్ (టిడిసిఏసి) గ్లోబల్‌ పోటీ లో ఫైనలిస్టులలో ఒకరిగా ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంకు చెందిన యువ కళాకారిణి కుమారి పేరూరి లక్ష్మీ సహస్ర ఎంపికైనందుకు, టొయోటా కిర్లోస్కర్ మోటార్ (టికెఎం) ఇటీవల సత్కరించింది. "టొయోటా 'స్ మెమరీ కార్" పేరుతో ఆమె రూపొందించిన ఊహాత్మక సృష్టి, 90 దేశాలు మరియు ప్రాంతాల నుంచి వచ్చిన 712,845 ఎంట్రీల నుండి ఎంపికైన టాప్ 26 ప్రపంచ ఫైనలిస్ట్‌లలో ఒకరిగా ఆమెకు స్థానాన్ని సంపాదించింది . 12-15 ఏళ్ల విభాగంలో ఆమె సాధించిన అత్యుత్తమ విజయానికి గుర్తింపుగా, ఆమెకు యుఎస్ డి 3,000 బహుమతి లభించింది.

శబరి మనోహర్ – వైస్ ప్రెసిడెంట్, సేల్స్-సర్వీస్-యూజ్డ్ కార్ బిజినెస్, టొయోటా కిర్లోస్కర్ మోటార్ మాట్లాడుతూ , “కుమారి పేరూరి లక్ష్మీ సహస్ర వంటి యువతను చూడటం నిజంగా స్ఫూర్తిదాయకం. టొయోటా డ్రీమ్ కార్ ఆర్ట్ కాంటెస్ట్ అనేది పోటీ కంటే ఎక్కువ-ఇది మొబిలిటీ ద్వారా ప్రకాశవంతమైన, మరింత అనుసంధానించబడిన భవిష్యత్తును ఊహించుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న పిల్లలకు ఆహ్వానం. ప్రపంచ వేదికపై కుమారి సహస్ర సాధించిన విజయానికి మేము గర్విస్తున్నాము " అని అన్నారు.

పేరూరి లక్ష్మీ సహస్ర గ్లోబల్ మాట్లాడుతూ , “నేను టొయోటా డ్రీమ్ కార్ ఆర్ట్ కాంటెస్ట్‌లో గ్లోబల్ ఫైనలిస్ట్‌లలో ఒకరిగా గుర్తించబడినందుకు చాలా సంతోషిస్తున్నాను. భవిష్యత్తులోని కార్లు ప్రపంచాన్ని ఎలా మార్చగలనో ఊహించాను. నా కలల కారు, టొయోటా యొక్క మెమరీ కార్, సాంకేతికత అనేది మొబిలిటీ కి సాధనంగా మాత్రమే కాకుండా జ్ఞాపకాలను భద్రపరచడంలో మరియు వ్యక్తులను అర్థవంతమైన మార్గాల్లో కనెక్ట్ చేయడంలో సహాయపడే ఆలోచనతో ప్రేరణ పొందింది. మా సృజనాత్మకతను వ్యక్తీకరించడానికి నాలాంటి యువతకు ఇంత అద్భుతమైన వేదికను అందించినందుకు టొయోటా కు నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను' అని అన్నారు.

విశాఖపట్నంలోని శ్రీ ప్రకాష్ విద్యానికేతన్ విద్యార్థిని పేరూరి లక్ష్మి . భారతీయ యువత సృజనాత్మకతకు నిలువెత్తు ఉదాహరణ. ఆమె డిజైన్, టొయోటా యొక్క మెమరీ కార్. అవార్డు గెలుచుకున్న ఎంట్రీలు డిసెంబర్ 2023 నుండి మార్చి 2024 వరకు ప్రపంచవ్యాప్తంగా జరిగిన జాతీయ పోటీలలో ఎంపిక చేయబడ్డాయి.

టొయోటా డ్రీమ్ కార్ ఆర్ట్ కాంటెస్ట్ గురించి మరింత సమాచారం కోసం మరియు పేరూరి లక్ష్మీ సహస్ర యొక్క అవార్డు-గెలుచుకున్న కళాకృతిని మరియు ఇతర అద్భుతమైన ఎంట్రీలను వీక్షించడానికి, దయచేసి అధికారిక పోటీ వెబ్‌సైట్‌ : https://www.toyota-dreamcarart.com.ని సందర్శించండి

టయోటా డ్రీమ్ కార్ ఆర్ట్ కాంటెస్ట్ యొక్క 18వ ఎడిషన్ డిసెంబర్'2024 నుండి నిర్వహించబడుతుంది. మరిన్ని వివరాలు మరియు భాగస్వామ్య అవసరాలు నిర్ణీత సమయంలో ప్రకటించబడతాయి.

Next Story