15 నిమిషాల్లో ఫుల్ ఛార్జ్.. స‌రికొత్త ఫాస్ట్ ఛార్జర్..!

భారతదేశంలో ఎలక్ట్రిక్ త్రీ వీలర్లు (e3W), ఎలక్ట్రిక్ టూ వీలర్లు (e2W) తయారీలో అగ్రగామిగా ఉన్న కైనెటిక్ గ్రీన్ ఎనర్జీ అండ్ పవర్ సొల్యూషన్స్ లిమిటెడ్, ఈరోజు వేగవంతమైన ఛార్జింగ్ టెక్నాలజీకి మార్గదర్శి అయిన ఎక్స్‌పోనెంట్ ఎనర్జీతో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రకటించింది.

By -  న్యూస్‌మీటర్ తెలుగు
Published on : 19 Nov 2025 3:32 PM IST

15 నిమిషాల్లో ఫుల్ ఛార్జ్.. స‌రికొత్త ఫాస్ట్ ఛార్జర్..!

భారతదేశంలో ఎలక్ట్రిక్ త్రీ వీలర్లు (e3W), ఎలక్ట్రిక్ టూ వీలర్లు (e2W) తయారీలో అగ్రగామిగా ఉన్న కైనెటిక్ గ్రీన్ ఎనర్జీ అండ్ పవర్ సొల్యూషన్స్ లిమిటెడ్, ఈరోజు వేగవంతమైన ఛార్జింగ్ టెక్నాలజీకి మార్గదర్శి అయిన ఎక్స్‌పోనెంట్ ఎనర్జీతో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రకటించింది. భారతదేశ ఎలక్ట్రిక్ మొబిలిటీ రంగంలో ఒక మైలురాయి పురోగతిలో భాగంగా ఈ కంపెనీలు దేశంలో అతిపెద్ద, వేగంగా అభివృద్ధి చెందుతున్న మరియు విస్తృతంగా ఉపయోగించే విభాగమైన ఇ-రిక్షాలు, ఇ-కార్గో కార్ట్‌లు L5 & L3 e3W కేటగిరీ కోసం దేశంలోనే అత్యంత వేగవంతమైన ఛార్జింగ్ సొల్యూషన్‌ను ప్రవేశపెడుతున్నాయి. ఈ భాగస్వామ్యం భారతదేశంలోని పట్టణ, సెమీ అర్బన్ మొబిలిటీ ఆపరేటర్లకు కార్యాచరణ సామర్థ్యం, ఉత్పాదకతను పునర్నిర్వచించటానికి హామీ ఇస్తుంది.

ఈ భాగస్వామ్యం కింద కైనెటిక్ గ్రీన్ ప్రసిద్ధ L3 మోడల్‌లు - సఫర్ స్మార్ట్, సఫర్ శక్తి, సూపర్ DX - ఇప్పుడు 15 నిమిషాల వేగవంతమైన ఛార్జింగ్ టెక్నాలజీని కలిగి ఉన్నాయి. ఇది చిన్న విరామాలలో త్వరిత రీఛార్జ్‌లకు వీలు కల్పిస్తుంది మరియు రోజువారీ ఆపరేటింగ్ గంటలను 30 శాతం వరకు పొడిగిస్తుంది.

L5 కేటగిరీలోని హై-స్పీడ్ పెర్ఫార్మెన్స్ లాజిస్టిక్స్ వాహనం అయిన L5N సఫర్ జంబో లోడర్ అసాధారణమైన పేలోడ్, రేంజ్‌కు ప్రసిద్ధి చెందింది. 15 నిమిషాల ఛార్జింగ్ ద్వారా వేగవంతమైన టర్న్‌అరౌండ్ సమయాలను అందిస్తుంది. ఇది వ్యక్తిగత యజమానులు -ఆపరేటర్లు, ఫ్లీట్ ఆపరేటర్‌లకు నేరుగా మరిన్ని ట్రిప్పులు, అధిక ఆదాయాలు, మెరుగైన రాబడికి దారితీస్తుంది. అదేవిధంగా, రాబోయే L5M ప్యాసింజర్ వేరియంట్, గంటకు 50 కి.మీ వరకు వేగాన్ని అందించగలదు. ఇది సుదీర్ఘమైన ఇంటర్‌సిటీ మార్గాల కోసం రూపొందిం చబడింది. రోజువారీ వినియోగాన్ని పెంచడానికి ఈ అధునాతన ఛార్జింగ్ సాంకేతికతను కూడా అవలంబిస్తుంది.

అత్యాధునిక బ్యాటరీ టెక్నాలజీ, స్మార్ట్ ఛార్జింగ్ నెట్‌వర్క్, ఇంటెలిజెంట్ సాఫ్ట్‌వేర్‌లను కలిగి ఉండే ఎక్స్‌పోనెంట్ ఎనర్జీ ప్రొప్రైటరీ ఫుల్-స్టాక్ ప్లాట్‌ఫామ్ కైనెటిక్ గ్రీన్ వాహనాలకు 15 నిమిషాల వేగవంతమైన ఛార్జింగ్‌ను, ప్రాపర్టీ జీవితకాల విలువను పెంచేవిధంగా పరిశ్రమలో అగ్రగామిగా ఉన్న 3000-సైకిల్ వారంటీని అందిస్తుంది. ఎక్స్‌పోనెంట్ యొక్క పెరుగుతున్న ఛార్జింగ్ నెట్‌వర్క్‌లో సజావైన ఛార్జింగ్ కోసం ఉమ్మడి పరిష్కారం రూపొందించబడింది. ఇది ఇంటిగ్రేటెడ్ డిజిటల్ ప్లాట్‌ఫామ్ రియల్ టైమ్ స్టేట్ ఆఫ్ ఛార్జ్ ట్రాకింగ్, ప్రిడిక్టివ్ మెయింటెనెన్స్ అలర్ట్‌లు, ఫ్లీట్ ఆప్టిమైజేషన్ కోసం డేటా అనలిటిక్స్‌ను అందిస్తుంది.

ఈ సందర్భంగా కైనెటిక్ గ్రీన్ వ్యవస్థాపకురాలు, సీఈఓ డాక్టర్ సులజ్జా ఫిరోడియా మోత్వానీ మాట్లాడుతూ, ‘‘ఈ భాగస్వామ్యం భారతదేశ ఎలక్ట్రిక్ త్రీ-వీలర్ రంగానికి ఒక నిర్ణయాత్మక క్షణాన్ని సూచిస్తుంది. దేశంలో మొట్టమొదటి 15 నిమిషాల పూర్తి ఛార్జ్ సొల్యూషన్‌ను ఇ-రిక్షాలు, కార్గో కార్ట్‌లకు తీసుకురావడం ద్వారా మేము అపూర్వమైన అప్‌టైమ్, సామర్థ్యాన్ని సాధించడానికి - భారతదేశ పట్టణ చివరి మైలు చలనశీలతకు వెన్నెముక అయిన ఓనర్ ఆపరేటర్లు, చిన్న & పెద్ద ఫ్లీట్ ఆపరేటర్లకు సాధికారత అందిస్తున్నాం. మా కస్టమర్-కేంద్రీకృత విధానం మా L3 e3W కేటగిరీ కోసం ఈ ప్రత్యేకమైన వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని నడిపిం చింది, మా కస్టమర్లకు ఉత్తమ యాజమాన్య ఖర్చును అందించింది. ఈ భాగస్వామ్యం గ్రీన్ మొబిలిటీని అందరికీ చేరువ చేసే మా లక్ష్యాన్ని వేగవంతం చేస్తుం ది, భారతదేశ ఈవీ మౌలిక సదుపాయాల అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తుంది’’ అని అన్నారు.

ఎక్స్‌పోనెంట్ ఎనర్జీ సీఈఓ, సహ వ్యవస్థాపకులు అరుణ్ వినాయక్ మాట్లాడుతూ, ‘‘ఎక్స్‌పోనెంట్ ఎనర్జీలో ఈవీలను సులభమైన ఎంపికగా మార్చడమే మా లక్ష్యం - అంటే నిజమైన ఆపరేటర్లకు నిజమైన సమస్యలను పరిష్కరించడం. ఈ భాగస్వామ్యం L5 & L3 సెగ్మెంట్ రెండింటినీ విస్తరించి భారతదేశంలోని e3W ల మొత్తం పోర్ట్‌ఫోలియోలో మా వేగవంతమైన ఛార్జింగ్ ప్లాట్‌ఫామ్‌ను పొందుపరచ డానికి అనుమతిస్తుంది. ఆపరేటర్లకు అసమానమైన వేగం, విశ్వసనీయత, స్కేలబిలిటీని అందిస్తుంది. ఎలక్ట్రిక్ రవాణా భవిష్యత్తు కోసం ఒక బ్లూప్రింట్‌ను రూపొందిస్తుంది’’ అని అన్నారు.

కైనెటిక్ గ్రీన్ కస్టమర్లకు తక్షణమే మద్దతు ఇవ్వడానికి, నాలుగు నగరాల్లోని 160 కి పైగా ఛార్జింగ్ స్టేషన్ల ఎక్స్‌పోనెంట్ ఎనర్జీ నెట్‌వర్క్ e3W ఫ్లీట్‌కు అందుబాటులోకి వస్తుంది. రాబోయే 12 నెలల్లో, ఈ మౌలిక సదుపాయాలు ప్రధాన మెట్రోలు, టైర్ II / III నగరాల్లోకి వేగంగా విస్తరిస్తాయి. ఎక్స్‌పోనెంట్ క్లౌడ్-ఆధారిత ఛార్జింగ్ డాష్‌బోర్డ్ కూడా కైనెటిక్ గ్రీన్ ఫ్లీట్ మేనేజ్‌మెంట్ యాప్‌లో విలీనం చేయ బడుతుంది. దీని వలన ఆపరేటర్లు ఛార్జీలను షెడ్యూల్ చేయడానికి, మార్గాలను ఆప్టిమైజ్ చేయడానికి, వాహన అప్ టైమ్‌ను సుల భంగా పెంచడానికి వీలు కల్పిస్తుంది.

ఈ భాగస్వామ్యం వేగవంతమైన ఛార్జింగ్ ఇంటిగ్రేటెడ్ e3W సొల్యూషన్స్‌లో కైనెటిక్ గ్రీన్ నాయకత్వాన్ని వేగవంతం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. అధిక వృద్ధి L3 విభాగంపై ప్రత్యేక దృష్టి సారించి, భారతదేశ e3W రంగంలో ఆధిపత్య శక్తిగా కైనెటిక్ గ్రీన్ స్థానాన్ని స్థిరపరుస్తుంది.

Next Story