అక్టోబర్ 12న అమెజాన్‌లో ఐఫోన్ ఆర్డర్ పెట్టాడు. అమెజాన్ పే కార్డ్‌తో రూ.70,900ల బిల్లు కూడా పే చేశాడు. అక్టోబర్ 15న ఆర్డర్ ప్యాక్ రావడంతో తెగ సంబరపడిపోయాడు. ఉత్సుకతో పార్సిల్ ఓపెన్ చేసి చూశాడు. అయితే పార్సిల్‌లో ఐఫోన్ రాలేదు.. రూ.5 నాణేం, అంట్లు తోమే విమ్ సబ్బు వచ్చింది. దీంతో అతడు ఒక్కసారిగా షాక్ తిన్నాడు. కేరళలోని కొచ్చికి చెందిన నూరుల్ అమీన్‌కు ఎదురైన వింత ఘటన ఇది. ఆర్డర్ ప్యాక్‌లో రూ.5 నాణేం, అంట్లు తోమే విమ్ సబ్బు రావడంపై నూరుల్ సైబర్ పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశాడు.
కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టగా.. నూరుల్ బుక్ చేసిన ఐఫోన్ జార్ఖండ్‌కు చెందిన ఓ వ్యక్తి సెప్టెంబర్ నెల నుంచే వాడుతున్నట్లు తెలిసింది. దీంతో పోలీసులు అమెజాన్ అధికారులను కలిసి వివరాలు కోరారు. సెప్టెంబర్ 25 నుండి ఈ ఐఫోన్ జార్ఖండ్‌లో ఓ వ్యక్తి వాడుతున్నాడని తెలిపింది. అయితే నూరుల్ నుంచి ఆర్డర్ వచ్చిన సమయంలో స్టాక్ అయిపోయింది, అప్పుడే అతడు పే చేసిన డబ్బును తిరిగి ఇవ్వబడతాయని తెలిపాం.. అంటూ అమెజాన్ అధికారులు తెలిపారు. నూరుల్ తనకెదురైన ఈ వింత ఘటనను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అది కాస్తా వైరల్‌గా మారింది.