ప్రీమియం శ్రేణి QLED టీవీలతో భారతీయ మార్కెట్లోకి ప్రవేశించిన JVC
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 13 Jan 2025 5:00 PM ISTకన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్‌లో ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన జపనీస్ బ్రాండ్ అయిన JVC, భారతీయ టీవీ మార్కెట్‌లోకి అధికారికంగా ప్రవేశించినట్లు సంతోషంగా వెల్లడించింది. 1927 లో కార్యకలాపాలు ప్రారంభించిన JVC, తన మహోన్నత వారసత్వంతో దాదాపు ఒక శతాబ్దం పాటు ప్రీమియం సాంకేతికత మరియు అసమానమైన ఆడియో-విజువల్ అనుభవాలను అందిస్తూ అత్యాధునిక ఆవిష్కరణలలో ముందంజలో ఉంది. టెలివిజన్లను ప్రారంభించిన మొట్టమొదటి బ్రాండ్ గా మరియు టెలివిజన్ పరిశ్రమలో అగ్రగామిగా, JVC ఇప్పుడు కొత్త శ్రేణి ప్రీమియం స్మార్ట్ QLED టెలివిజన్లతో భారతదేశానికి తన అత్యుత్తమ వారసత్వాన్ని తీసుకువస్తుంది, ఇది గృహ వినోదానికి సరికొత్త ప్రమాణాలను తీసుకువస్తోంది. ఈ బ్రాండ్ భారతదేశంలో మొట్టమొదటి 40 అంగుళాల QLED టీవీని కూడా తీసుకువచ్చింది.
భారతీయ మార్కెట్లోకి JVC ప్రవేశం బ్రాండ్‌కు ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది, ఇది అభివృద్ధి చెందుతున్న వినియోగదారుల అవసరాలను తీర్చే అధిక-నాణ్యత, వినూత్న ఉత్పత్తులను అందించడంలో దాని నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. వినియోగదారు ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలో 97 సంవత్సరాలకు పైగా నైపుణ్యంతో, పనితీరు, విశ్వసనీయత మరియు అత్యుత్తమ పనితనంకు పర్యాయపదంగా JVC ఉంది. ఈ అత్యుత్తమ వారసత్వం దాని కొత్త టెలివిజన్ శ్రేణితో కొనసాగుతుంది, భారతీయ వినియోగదారులు ఇంట్లో ప్రపంచ స్థాయి వినోద అనుభవాలను ఆస్వాదించేలా చేస్తుంది.
JVC QLED టీవీలు అద్భుతమైన స్మార్ట్ టీవీలు, AI విజన్ సిరీస్‌లో భాగంగా ఉంటాయి. అసాధారణమైన వీక్షణ అనుభవాన్ని అందించడానికి రూపొందించబడ్డాయి. 3840 x 2160 పిక్సెల్‌ల రిజల్యూషన్ మరియు 60Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉన్న ఈ టెలివిజన్లు HDR10 తో శక్తివంతమైన, క్రిస్టల్-క్లియర్ విజువల్స్ మరియు ఉన్నతమైన చిత్ర నాణ్యత కోసం 1 బిలియన్ రంగులను అందిస్తాయి. DOLBY ATMOS సౌండ్ టెక్నాలజీతో అమర్చబడి, ఇవి శక్తివంతమైన 80-వాట్ అవుట్‌పుట్‌తో లీనమయ్యే ఆడియోను అందిస్తాయి.
స్మార్ట్ ఫీచర్లలో Google TV, అంతర్నిర్మిత Wi-Fi, GOOGLE ASSISTANTతో వాయిస్ కంట్రోల్ మరియు NETFLIX, PRIME VIDEO, YOUTUBE మరియు ZEE5 వంటి ప్రసిద్ధ యాప్‌లను నేరుగా చేరుకునే వీలు ఉంది. కనెక్టివిటీ ఎంపికలలో 3 HDMI పోర్ట్‌లు, 2 USB పోర్ట్‌లు, డ్యూయల్ బ్యాండ్ Wi-Fi, ఎథర్నెట్, బ్లూటూత్ 5.0 మరియు eARC మద్దతు ఉన్నాయి, గేమింగ్ కన్సోల్‌లు, సెట్-టాప్ బాక్స్‌లు మరియు ఇతర పరికరాలతో సజావుగా ఏకీకరణను నిర్ధారిస్తాయి. 2GB RAM మరియు 16GB ROMతో, ఈ స్మార్ట్ టీవీలు సున్నితమైన పనితీరును మరియు యాప్‌లు, కంటెంట్ కోసం తగినంత స్టోరేజ్ ను అందిస్తాయి. అధునాతన ఫీచర్లు మరియు కనెక్టివిటీతో ప్రీమియం వినోద అనుభవాన్ని కోరుకునే వారికి ఈ టీవీలు సరైనవి.
JVC AI విజన్ సిరీస్ 32-అంగుళాల QLED నుండి 75-అంగుళాల QLED టీవీల వరకు 7 పరిమాణాలలో అందుబాటులో ఉంది, ఈ సిరీస్ రూ. 11,999 నుండి ప్రారంభమవుతుంది. 75-అంగుళాల QLED టీవీ ఆకర్షణీయమైన ధర రూ. 89,999 వద్ద లభిస్తుంది. అధునాతన ఫీచర్లు మరియు ఆధునిక డిజైన్‌తో ప్రీమియం వినోద అనుభవాన్ని కోరుకునే కస్టమర్లకు ఈ మోడల్‌లు సరైనవి.
JVC యొక్క అన్ని కొత్త శ్రేణి టెలివిజన్‌లు జనవరి 14, 2025 నుండి అమెజాన్ రిపబ్లిక్ డే సేల్ సందర్భంగా అమెజాన్‌లో ప్రత్యేకంగా అందుబాటులో ఉంటాయి
JVC TV ఇండియా కంట్రీ ప్రతినిధి పల్లవి సింగ్ మాట్లాడుతూ, “భారతీయ వినియోగదారులకు JVC యొక్క అత్యాధునిక టెలివిజన్ శ్రేణిని పరిచయం చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో ఇండియా ఒకటి, మరియు మా వినూత్నమైన, అధిక-నాణ్యత కలిగిన ఉత్పత్తులు ఇంట్లో లీనమయ్యే వినోద అనుభవాలను కోరుకునే స్థానిక వినియోగదారుల నడుమ ప్రతిధ్వనిస్తాయని మేము విశ్వసిస్తున్నాము. మా వ్యూహాత్మక భాగస్వామి అమెజాన్ తో భాగస్వామ్యం ఆధారంగా, మా టెలివిజన్లు ప్రతి వీక్షకుడికి ఇష్టమైన టీవీ షోలు, సినిమాలు లేదా క్రీడలను ఆస్వాదించేలా చేయటంతో పాటుగా వారి అవసరాలను తీరుస్తాయని మేము విశ్వసిస్తున్నాము ” అని అన్నారు.
ఆమె నే మాట్లాడుతూ "మేము భారత మార్కెట్ యొక్క అభివృద్ధి చెందుతున్న అవసరాలకనుగుణంగా ఆవిష్కరణలు చేయటం తో పాటుగా వారి అభిరుచులకనుగుణంగా ఉత్పతులను అందించటం కొనసాగించనుండటం చేత , రాబోయే 3 సంవత్సరాలలో రూ. 500 కోట్ల రూపాయల ఆదాయాన్ని సాధించడం లక్ష్యంగా చేసుకున్నాము. మా ఉత్పత్తి పోర్ట్‌ఫోలియోను విస్తరించడం మరియు వినియోగదారుల తో అనుబంధాన్ని మెరుగుపరచడంపై దూకుడు గా వెళ్లడం తో ఇది సాధ్యమవుతుందని ఆశిస్తున్నాము" అని అన్నారు.
సేల్ కోసం బ్యాంక్ ఆఫర్:
● అమెజాన్ ఇండియా: SBI క్రెడిట్ కార్డ్ మరియు ఈఎంఐ లావాదేవీలతో 10% తక్షణ డిస్కౌంట్
Product Link: https://www.amazon.in/dp/B0DS16LB5H