మెగా సర్వీస్ క్యాంపును అనంతపురంకు తీసుకువస్తోన్న జావా యెజ్డీ మోటర్‌సైకిల్స్

జావా యెజ్డీ మోటర్‌సైకిల్స్ తమ అత్యంత విజయవంతమైన మెగా సర్వీస్ క్యాంప్‌ను ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురంకి తీసుకువస్తోంది.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  22 May 2024 4:45 PM IST
మెగా సర్వీస్ క్యాంపును అనంతపురంకు తీసుకువస్తోన్న జావా యెజ్డీ మోటర్‌సైకిల్స్

జావా యెజ్డీ మోటర్‌సైకిల్స్ తమ అత్యంత విజయవంతమైన మెగా సర్వీస్ క్యాంప్‌ను ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురంకి తీసుకువస్తోంది. ఈ కార్యక్రమం అనంతపురంలో మే 24 నుండి మే 25 వరకు జరుగుతుంది. దీని ద్వారా ఈ ప్రాంతంలోని 2019 మరియు 2020 మోడల్‌ల జావా మోటర్‌సైకిల్ యజమానులకు ప్రత్యేకంగా సేవలను అందించనున్నారు. ఈ సేవా శిబిరం అనంతపురంలో శ్రీనివాస మోటర్స్ - సర్వే నెంబర్ 63, డోర్ నెంబర్ # 1-697 సి , రుద్రపేట బై పాస్ రోడ్, అనంతపురం - 515001 వద్ద నిర్వహించబడుతుంది.

ఈ శిబిరంలో భాగంగా, 2019-2020 జావా మోటర్‌సైకిళ్ల యజమానులు సమగ్ర వాహన ఆరోగ్య తనిఖీకి మరియు ఎంపిక చేసిన విడిభాగాలను ఉచితంగా పొందడానికి అర్హులు. మోతుల్, అమరాన్ మరియు సియట్ టైర్‌లతో సహా ప్రముఖ ఒరిజినల్ ఎక్విప్‌మెంట్ సప్లయర్‌లు కస్టమర్‌లకు సహాయం చేయడానికి చురుకుగా పాల్గొంటాయి. దీర్ఘకాలిక కస్టమర్ సంతృప్తి కోసం నిరంతర నిబద్ధతతో, జావా యెజ్డీ మోటర్‌సైకిల్స్ , కాంప్లిమెంటరీ ఎక్సటెండెడ్ వారంటీలను అందిస్తోంది. అదనంగా, మార్పిడి విలువను అంచనా వేయడానికి వారి మోటర్‌సైకిళ్లను అప్‌గ్రేడ్ చేయడానికి ఆసక్తి ఉన్న యజమానుల కోసం ఒక నిర్దేశిత జోన్ ఏర్పాటు చేయబడుతుంది.

జావా యెజ్డీ మోటర్‌సైకిళ్ల యజమానులు తమ వాహనాల సర్వీసింగ్ కోసం సమీప బ్రాండ్ డీలర్‌షిప్‌లో తమ స్లాట్ ను బుక్ చేసుకోవాల్సి ఉంటుంది

Next Story