భవిష్యత్తు మొబిలిటీ విజన్‌ని ప్రదర్శించిన హీరో మోటోకార్ప్

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  7 Nov 2024 12:15 PM GMT
భవిష్యత్తు మొబిలిటీ విజన్‌ని ప్రదర్శించిన హీరో మోటోకార్ప్

"బి ది ఫ్యూచర్ ఆఫ్ మొబిలిటీ" అనే మా విజన్‌తో, వినూత్నత, సుస్థిరత్వంలో హద్దులను అధిగమించడం, కొత్త ప్రమాణాలను నిర్దేశించడాన్ని హీరో మోటోకార్ప్ లక్ష్యంగా పెట్టుకుంది. రాబోయే తరాలకు ప్రయోజనం చేకూ ర్చేలా చలనశీలత భవిష్యత్తును రూపొందించే మార్గదర్శక సాంకేతికతల పట్ల మా నిబద్ధతతో మేము ముందుకు ప్రయాణిస్తున్నాం.

"ప్రపంచంలోని అతి పెద్ద ద్విచక్ర వాహన తయారీదారుగా, హీరో మోటోకార్ప్ "వినూత్నత, భారత్ లో తయారీ" స్ఫూర్తిని కలిగి ఉంది. పర్యావరణ సుస్థిరతపై దృష్టి సారిస్తూనే మా 120 మిలియన్ల కస్టమర్లకు సేవలందిం చడంలో మా అంకితభావాన్ని పటిష్టం చేస్తూ మా కార్యకలాపాలకు సంబంధించిన ప్రతి అంశం లోనూ ఈ నైతికత విస్తరించింది.

"హీరో మోటోకార్ప్ విశ్వసనీయత, మా మెషీన్‌ల తట్టుకునే సామర్థ్యానికి ప్రసిద్ధి చెందిన నమ్మకమైన ప్రపంచ అగ్రగామి సంస్థగా కొనసాగుతోంది. మేము యూరప్, యూకేకి విస్తరించినప్పుడు ఈ శాశ్వతమైన నమ్మకం, మా ప్రపంచ-స్థాయి ఉత్పత్తులు అందుకు అవసరమైన పునాదిని ఏర్పరుస్తాయి.

"విలక్షణమైన అంతర్జాతీయ ఉనికి, ఆయా విభాగాల్లో నాయకత్వ స్థానపు విశిష్టతలు, అధునాతన సాంకేతికత మరియు హీరో మోటోకార్ప్‌ని నిర్వచించే ప్రశంసలు పొందిన ఇంజనీరింగ్ ఉత్కృష్టతతో కూడిన నాలుగు ప్రపంచ-స్థాయి ఉత్పత్తులను ఆవిష్కరించడానికి మేం సంతోషిస్తున్నాం."

-డాక్టర్ పవన్ ముంజాల్

ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్, హీరో మోటోకార్ప్

ప్రపంచంలోనే అతిపెద్ద మోటార్‌సైకిళ్లు, స్కూటర్ల తయారీదారు అయిన హీరో మోటోకార్ప్ ఈఐసీఎంఏ 2024లో అనేక ఉత్తేజకరమైన మరియు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కొత్త మోటార్‌సైకిళ్లను, ఒక ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఆవిష్కరించింది. 2025 రెండో అర్థభాగం నాటికి పలు యూరోపియన్ దేశాలు, యూకే మార్కెట్ల లోకి ప్రవేశిం చాలని కంపెనీ తన ప్రణాళికలను ప్రకటించింది.

'బి ది ఫ్యూచర్ ఆఫ్ మొబిలిటీ' అనే తన విజన్‌కు అనుగుణంగా హీరో మోటోకార్ప్ తన ప్రీమియం శ్రేణి కొత్త, ఇప్పటికే ఉన్న ఇంటర్నల్ కంబుషన్ ఇంజిన్ (ఐసీఈ), ఎలక్ట్రిక్ వెహికల్ (ఈవీ) ఉత్పత్తులను ప్రదర్శించింది. వీటిలో అవార్డులు గెలుచుకున్న, ఫ్యూచరిస్టిక్ సర్జ్ S32, FIM వరల్డ్ ఛాంపియన్‌షిప్ విన్నింగ్ అడ్వెంచర్ మెషిన్,హీరో 450 ర్యాలీ, సంచలనాత్మక ఎలక్ట్రిక్ కాన్సెప్ట్‌లు ఉన్నాయి.

ఉత్పాదనల ప్రదర్శన

ప్రీమియమైజేషన్ ప్రయాణాన్ని కొనసాగిస్తూ తన ఉత్పత్తి పోర్ట్‌ఫోలియోను కొత్త కేటగిరీలుగా విస్తరిస్తూ, హీరో మోటోకార్ప్ మూడు కొత్త మోటార్‌సైకిళ్లను ఆవిష్కరించింది – ఎక్స్ పల్స్ 210, ఎక్స్ ట్రీమ్ 250R, కరిజ్మా ఎక్స్ఎంఆర్ 250.

బహుముఖ మోటార్‌సైకిల్ శ్రేణి వివిధ రైడింగ్ స్టైల్స్ మరియు ఆఫ్-రోడ్/ అడ్వెంచర్ నుండి స్ట్రీట్ మరియు ట్రాక్ వరకు వివిధ రోడ్‌లను అందిస్తుంది. అదే సందర్భంలో విడా జెడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ పర్యావరణ స్పృహ కలిగిన కస్టమర్‌లకు స్టైల్ మరియు పనితీరును అందిస్తుంది.

విడా జెడ్ అనేది అంతర్జాతీయంగా కొనుగోలుదారులకు సంబంధించిన ఒక ఉత్పత్తి. దీని గొప్ప ఫీచర్లు, స్టైలింగ్‌తో బార్సిలోనా నుండి బొగోటా వరకు ప్రతిధ్వనిస్తుంది. కొనుగోలుదారులు మరింత వివేచనాత్మకంగా మారడంతో, కొత్త సాంకేతికతలతో కూడిన సుస్థిరదాయకమైన ఈ ఉత్పాదన స్వేచ్ఛ, ఉత్సాహం, ఆనందాన్ని వ్యక్తీకరించడం లక్ష్యంగా పెట్టుకుంది. విడా జెడ్ డిజైన్ తాత్వికత పనితీరులో “సరదా” ను వేడుక చేసుకోవడం. ఇది తన విలక్షణమైన సిల్హౌట్ కారణంగా గుర్తించదగిన మరియు సాపేక్షంగా ఉండే విలక్షణ డిజైన్‌ను కలిగి ఉంది.

హీరో మోటోస్పోర్ట్స్ టీమ్ ర్యాలీ ఎఫ్ఐఎం వరల్డ్ ఛాంపియన్ రాస్ బ్రాంచ్ నుండి ఇన్‌పుట్‌తో అభివృద్ధి చేయబడిన ఎక్స్ పల్స్ 210 అనేది ప్రయాస లేని రైడింగ్ సారాంశాన్ని సంగ్రహించేలా ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ పొందిన ఉత్పాదన. ఇది మినిమలిస్టిక్ డిజైన్‌ను కలిగి ఉంది, ఉత్తేజకరమైన రైడ్‌ను అందిస్తుంది. ఇది షోరూమ్ ఫ్లోర్ నుండి నేరుగా అడ్వెంచర్-రెడీ.

ఎక్స్ ట్రీమ్ 250R అనేది అల్టిమేట్ స్ట్రీట్ ఛాంపియన్‌గా రూపొందించబడింది. ఇది దాని రూపకల్పన, సౌందర్యం, పనితీరు ద్వారా ఉండే "స్పోర్టీ" డీఎన్ఏని కలిగి ఉంది. దీని దూకుడు స్టైలింగ్, శక్తివంతమైన వైఖరితో ఈ మోటార్‌ సైకిల్ ప్రసిద్ధ ఎక్స్ ట్రీమ్ పవర్ బ్రాండ్‌కి పొడిగింపు.

కరిజ్మా XMR 250 అనేది అందరినీ ఆకట్టుకునేది. ఇది పనితీరు, స్టైల్ రెండింటినీ అందిస్తుంది. రేసింగ్-ప్రేరేపిత వింగ్‌లెట్‌లతో పూర్తి చేసిన ఫుల్లీ-ఫెయిర్డ్ డిజైన్ దీని విజువల్ అప్పీల్‌ను మెరుగుపరుస్తుంది మరియు ఎత్తు-సర్దుబాటు చేయగల క్లిప్-ఆన్ హ్యాండిల్‌బార్‌ల వంటి వినూత్న ఫీచర్లు రైడర్ సౌకర్యాన్ని నిర్ధారిస్తాయి. రేస్ ట్రాక్‌ లో ఉన్నా లేదా ఓపెన్ రోడ్‌లో ఉత్సాహభరితమైన రైడ్‌ను ఆస్వాదించినా, కరిజ్మా XMR 250 ఒక అద్భుతమైన అనుభూతిని అందిస్తుంది.

ప్రపంచ విస్తరణ

2025 రెండో అర్థభాగం నుండి యూరప్, యూకే లో తన వాణిజ్య కార్యకలాపాలను విస్తరించే లక్ష్యంతో హీరో మోటో కార్ప్ ఒక కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ విడా జెడ్ పై సవారీ చేస్తూ మార్కెట్‌లలోకి ప్రవేశిస్తుంది. తదనంతరం, కంపెనీ తన పరిధిని అధిక సామర్థ్యం గల ప్రీమియం ఇంటర్నల్ ఇంబుషన్ ఇంజిన్ (ఐసీఈ) మోటార్ సైకిళ్ళకు విస్తరించాలని యోచిస్తోంది.

హీరో మోటోకార్ప్ యూరప్‌లో టెక్నాలజీ సెంటర్‌ - టెక్ సెంటర్, జర్మనీ (TCG) - కలిగి ఉంది. హీరో మోటోస్పోర్ట్స్ టీమ్ ర్యాలీ కూడా TCG నుండే బయటకు వచ్చింది. కంపెనీ యొక్క ప్రస్తుత, కొత్త ఉత్పత్తి శ్రేణి యూరోపియన్ మార్కెట్ల ప్రస్తుత, భవిష్యత్తు అవసరాలకు తగిన విధంగా సరిపోతుంది.

ఇటలీలో పంపిణీదారుగా పెల్పి ఇంటర్నేషనల్ ఎస్ఆర్ఎల్ నియామకాన్ని కంపెనీ ప్రకటించింది. కంపెనీ అంతకు ముందు స్పెయిన్ -నోరియా మోటోస్ ఎస్ఎల్ యూ, ఫ్రాన్స్ – జీడీ ఫ్రాన్స్, యూకే - మోటోజీబీ యూకే భాగ స్వాములతో వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకుంది.

ఉత్పాదన స్పెసిఫికేషన్స్

విడా జెడ్

విడా జెడ్ అనేది విడా నుండి తాజా ఉత్పత్తి. హీరో ద్వారా అందించబడింది, ఇది ప్రపంచ కొనుగోలుదారులను దృష్టిలో ఉంచుకుని రూపొందించబడింది. ఈ స్కూటర్ రోజువారీ ప్రయాణానికి సరిపోయే ఆనందించే రైడ్‌ను అందిస్తుంది, అదే సమయంలో స్వేచ్ఛ, ఉత్సాహాన్ని కూడా అందిస్తుంది.

విడా జెడ్ అనేది మై విడా యాప్ ద్వారా బహుళ రకాల ఛార్జింగ్, తొలగించగల బ్యాటరీ, నమ్మదగిన పనితీరు, కనెక్టెడ్, సేఫ్టీ సూట్‌కి సంబంధించిన అదనపు హామీని అందించడం ద్వారా "దిగులు రహిత యాజమాన్యాన్ని" అందిస్తుంది.

విడా జెడ్ అత్యాధునిక శాశ్వత మాగ్నెట్ సింక్రోనస్ మోటార్ (PMSM) డ్రైవ్ ట్రైన్‌తో వస్తుంది, ఇది సామర్థ్యం, తక్కువ నిర్వహణ, పనితీరు ఉత్తమ కలయికను అందిస్తుంది. మాడ్యులర్ ఆర్కిటెక్చర్ 2.2 kWh నుండి మొదలై 4.4 kWh బ్యాటరీ వరకు బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.

ఈ వాహనం మా కొత్త యుగం, అత్యాధునిక కనెక్టివిటీ సూట్ + క్లౌడ్ ప్లాట్‌ఫామ్‌తో అమర్చబడి ఉంటుంది. ఈ కొత్త ప్లాట్‌ఫామ్ యజమానులు వాహన ఆరోగ్యం, దొంగతనం/కదలిక గుర్తింపు, జియోఫెన్సింగ్‌ను పర్యవేక్షించ డానికి/ట్రాక్ చేయడానికి, అనధికార వినియోగం విషయంలో వాహనాన్ని కదలకుండా ఉంచడానికి, సర్వీస్ స్టేషన్‌ను సందర్శించాల్సిన అవసరం లేకుండానే ఓవర్ ది ఎయిర్ (OTA) అప్‌డేట్‌లను నిర్వహించడానికి వీలు కల్పిస్తుంది.

ఈ స్కూటర్ స్టాండ్ అవుట్ డిజైన్ ఎలిమెంట్స్‌లో ఇది స్కూటర్ హ్యాండిల్‌బార్, యాక్సెంట్స్, మినిమలిస్టిక్ డిజైన్, టచ్-ఎనేబుల్డ్ TFT డిస్‌ప్లే, ఇండస్ట్రీ బెస్ట్ గ్రేడబిలిటీ ఉన్నాయి.

ఎక్స్ పల్స్ 210

ఎక్స్ పల్స్ 210 సాహస స్ఫూర్తిని శక్తివంతం చేయడానికి రూపొందించబడింది. శక్తివంతమైన 210cc DOHC లిక్విడ్-కూల్డ్ ఇంజన్ 24.5 bhp మరియు 20.4 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. స్విచ్ చేయదగిన ABS మోడ్‌లతో పాటు 210mm ఫ్రంట్ మరియు 205mm బ్యాక్ సస్పెన్షన్‌ అనేది అడాప్టబుల్ బ్రేకింగ్ కు సంబంధించి రైడర్‌కు ఏ భూ ఉపరితలాన్ని అయినా అధిగమించగల విశ్వాసాన్ని ఇస్తాయి.

గుట్టల మార్గాల్లో ప్రయాణించినా లేదా నగర వీధుల గుండా దూసుకెళ్లినా Xpulse 210 ఉత్కంఠభరితమైన, ప్రతిస్పందించే రైడ్‌ను అందిస్తుంది. స్లిప్పర్, అసిస్ట్ క్లచ్‌తో కూడిన 6-స్పీడ్ గేర్‌బాక్స్ స్మూత్ గేర్ షిఫ్ట్‌లను నిర్ధారిస్తుంది.

220mm అధిక గ్రౌండ్ క్లియరెన్స్‌తో, ఇది కఠినమైన భూ ఉపరితలాలను సులభంగా నిర్వహించగలదు. 4.2” TFT స్పీడోమీటర్ స్పష్టమైన రైడ్ సమాచారాన్ని అందిస్తుంది. సర్దుబాటు చేయగల హ్యాండిల్‌బార్ అనుకూల మైన సౌకర్యాన్ని నిర్ధారిస్తుంది. ఆఫ్-రోడ్ సంసిద్ధత కోసం ర్యాలీ కిట్‌తో జత చేయబడింది, ఇది ఏదైనా సాహసానికి సరైన సహచరుడిని చేస్తుంది.

ఎక్స్ ట్రీమ్ 250R

సరికొత్త ఎక్స్ ట్రీమ్ 250R తన విభాగంలో వేగవంతమైన మోటార్‌సైకిల్, బ్రాండ్ కోసం ఉద్దేశించబడింది. స్పోర్టీగా అందరినీ ఆకట్టుకుంటుంది. దూకుడు స్టైలింగ్, శక్తివంతమైన వైఖరిని పెంచుతుంది. 4-వాల్వ్ సిస్టమ్‌తో కూడిన బలమైన 250cc లిక్విడ్-కూల్డ్ DOHC ఇంజన్ నుండి ట్రెల్లిస్ ఫ్రేమ్ వరకు మోటార్‌సైకిల్‌లోని ప్రతి అంశం దీని చురుకైన నిర్వహణ, ఉత్తేజకరమైన పనితీరుకు దోహదం చేస్తుంది. ఇది 30 PS గరిష్ట శక్తిని, 25 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది, ఇది వేగం అందించేందుకు నిర్మించబడింది.

USD ఫ్రంట్ సస్పెన్షన్, 6-స్టెప్ అడ్జస్టబుల్ మోనో-షాక్ రియర్ సస్పెన్షన్, 50-50 వెయిట్ బ్యాలెన్స్‌తో కూడిన రేడియల్ టైర్లు అసాధారణమైన గ్రిప్ మరియు రెస్పాన్సిబిలిటీని అందిస్తాయి, ఇది రైడర్‌లు విశ్వాసంతో వేగాన్ని అనుభవించేలా చేస్తుంది.

ఈ బైక్‌ దాని హద్దులను అధిగమించేలా రూపుదిద్దుకుంది. స్విచ్ చేయగల ABS మోడ్‌లు, DRLలతో కూడిన ఆటో-ఇల్యూమినేషన్ క్లాస్-D LED ప్రొజెక్టర్ హెడ్‌లైట్ అలాగే ల్యాప్ టైమర్ మరియు డ్రాగ్ టైమర్‌తో సహా రైడర్-సెంట్రిక్ టెక్నాలజీతో ప్యాక్ చేయబడింది - ఇది పరిమితులను పరీక్షించాలనుకునే రైడర్‌లకు కచ్చితంగా సరిపోతుంది. ప్రయాణంలో కనెక్ట్ అయి ఉండటానికి మరియు సమాచారం ఇవ్వడానికి ఇది TBT నావిగేషన్, మ్యూజిక్ కంట్రోల్ వంటి కనెక్టెడ్ ఫీచర్‌లను కలిగి ఉంది.

కరిజ్మా XMR 250

కరిజ్మా XMR 250 పనితీరు, స్టైల్ రెండింటినీ అందిస్తుంది. 250cc DOHC 4V లిక్విడ్-కూల్డ్ ఇంజిన్‌తో ఆధారితమైన ఇది 30 PS గరిష్ట శక్తిని, 25 Nm గరిష్ట టార్క్‌ను అందిస్తుంది, ఇది ప్రతి కోణంలోనూ నిజమైన స్పోర్ట్స్ బైక్. సొగసైన లైన్స్, దూకుడు వైఖరి, రేసింగ్-ప్రేరేపిత వింగ్‌లెట్‌లు, ఎత్తు-సర్దుబాటు చేయగల క్లిప్-ఆన్ హ్యాండిల్‌బార్‌ల వంటి సమర్థతా లక్షణాలు డిజైన్ హైలైట్స్ గా ఉన్నాయి.

ఈ మోటార్‌సైకిల్ నిర్మాణం ధృడమైన ట్రేల్లిస్ ఫ్రేమ్‌తో బలోపేతం చేయబడింది. ఇది USD ఫ్రంట్ సస్పెన్షన్‌తో పాటు 6-స్టెప్ అడ్జస్టబుల్ మోనోషాక్ రియర్ సస్పెన్షన్, సాఫీగా ప్రయాణించడానికి మారగల ABS మోడ్‌లను కలిగి ఉంది. ఆటో-ఇల్యూమినేషన్ క్లాస్-డి మల్టీ-ప్రొజెక్టర్ ఎల్ఈడీ హెడ్‌లైట్, ఎల్ఈడీ డీఆర్ఎల్ లతో పాటు పనితీరు ట్రాకింగ్ కోసం ల్యాప్ టైమర్, డ్రాగ్ టైమర్ అనేవి మోటార్‌సైకిల్ వినియోగాన్ని మెరుగు పరుస్తాయి.

Next Story